ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోల్ కతాలోని చందానగర్ ప్రాంతానికి చెందిన అగ్నిశ్వర్ చక్రవర్తి(30) కొండాపూర్ లోని ప్రశాంత్ నగర్ కాలనీలో స్నేహితుడడు సప్తర్ష ముఖర్జీతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు.

Also Read తాగిన మత్తులో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య.

అక్కడే ఉంటూ స్థానికంగా ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం సప్తర్షి వైజాగ్ వెళ్లాడు. అయితే అగ్నిశ్వర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని కోల్ కతాలో ఉంటున్న అతని సోదరి ఆదివారం సప్తర్షికి ఫోన్ చేసి చెప్పింది.

దీంతో సప్తర్షి సోమవారం ఉదయం ఫ్లాట్ కి వచ్చిచూడగా తలుపులు మూసి ఉన్నాయి. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపులు విరగగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అగ్నిశ్వర్ బెడ్ షీట్ తో ఫ్యాన్ కి ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. కిందకు దింపి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.