ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు దర్శనమివ్వడం కలకలం రేపింది. సామాజిక కార్యకర్త మహ్మద్ సలీం ఈ పోస్టు పెట్టారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు దర్శనమివ్వడం కలకలం రేపింది. సామాజిక కార్యకర్త మహ్మద్ సలీం ఈ పోస్టు పెట్టారు. అధికారం అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. అలాచేస్తే.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అతిక్ అహ్మాద్ లాంటి పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
Also Read: చూచిరాతలు, కుంభకోణాలు.. : తెలంగాణ విద్యా వ్యవస్థపై బొత్స సంచలనం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు సెక్యూరిటీ ఇచ్చినా ఏమి చేయలేవని హెచ్చరికలు జారీ చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలనే సెక్యూరిటీ సిబ్బంది కాపాడలేకపోయిందని అన్నారు. అయితే ఈ హెచ్చరికలపై ఎంఐఎం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.
