రంగారెడ్డిజిల్లా నార్సింగిలో ఓ ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. నిన్నరాత్రి ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ : హైదరాబాద్ శివారు రంగారెడ్డిజిల్లా నార్సింగిలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ ఆరేళ్ల చిన్నారి పాడుబడ్డ బావిలో పడి మృతి చెందాడు. నిన్న సాయంత్రం కిరాణా కొట్టుకు వెళ్లిన బన్నీ అనే ఆరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అంతటా వెతికిన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. అనుమానంతో బావిలో వెతకగా.. మృతదేహం ఉన్నట్లుగా గమనించారు. దీంతో రెస్కు టీం సహాయంతో బావిలోని నీరంతా తోడేసి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
