నిలోఫర్ ఆస్పత్రిలో ఆరు నెలల చిన్నారి అదృశ్యం
పిల్లల ఆస్పత్రి అయిన నిలోఫర్ లో ఓ 6 నెలల చిన్నారి అదృశ్యం కలకలం రేపుతోంది.

హైదరాబాద్ : హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం కలకలం రేపుతోంది. 6 నెలల చిన్నారి ఫైసల్ ఖాన్ ను దుండగులు అపహరించారు. తల్లి భోజనం కోసం వెళ్లగా దుండగులు చిన్నారిని తీసుకెళ్లారు. భోజనం చేసి వచ్చేసరికి చిన్నారి కనిపించకపోవడంతో.. అంతా వెతికిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
అయితే, నిలోఫర్ ఆస్పత్రిలో సీసీ టీవీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కేసులో ముందుకు వెళ్లడం సవాల్ గా మారింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.