పాప దొరికింది: కోఠిలో మాయమై బీదర్‌లో....

Six days baby found in Bidar government hospital
Highlights

బీదర్‌లో పసిపాపను వదిలేసిన కిడ్నాపర్


హైదరాబాద్: కోఠి ప్రభుత్వాసుపత్రిలో  కిడ్నాపైన ఆరు రోజుల పసిపాప బీదర్ ప్రభుత్వాసుపత్రిలో  మంగళవారం నాడు కిడ్నాపర్‌ వదిలివెళ్లింది. పోలీసులు తనను  వెంటాడుతున్నారని భావించిన మహిళ ఆ పాపపను వదిలేసి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

సోమవారం నాడు ఉదయం పూట  కోఠి ప్రభుత్వాసుపత్రి నుండి ఆరు రోజుల  పసిపాప కిడ్నాప్‌కు గురైంది. రంగారెడ్డి జిల్లాలోని ఎల్లమ్మ తండాకు చెందిన విజయ ఆరు రోజుల క్రితం అమ్మాయికి జన్మనిచ్చింది. ఆసుపత్రిలోనే ఆమె చికిత్స పొందుతోంది.

టీకా వేయిస్తానని చెప్పిన ఓ మహిళ చిన్నారిని సోమవారం నాడు కిడ్నాప్ చేసింది. బస్సులో బీదర్ వరకు చిన్నారిని తీసుకెళ్లినట్టు  పోలీసులు గుర్తించారు. మంగళవారం నాడు ఉదయం పూట బీదర్ చేరుకొన్న పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ ‌ను కూడ విచారించారు.

అయితే బీదర్ లో పోలీసులు జల్లెడ పట్టారు. మూడు బృందాలుగు వెళ్లిన పోలీసులు కర్ణాటక పోలీసుల సహకారంతో చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బీదర్ ప్రభుత్వాసుపత్రిలో  చిన్నారిని  వదిలివెళ్లిపోయింది.

200 సీసీ కెమెరాల సహాయంతో పోలీసులు కిడ్నాపర్ ఎక్కడకు వెళ్లిందనే విషయాన్ని గుర్తించారు. హైద్రాబాద్ నగరంలోని సీసీ కెమెరాల సహాయంతో ఆచూకీ కోసం ప్రయత్నించారు. 

బీదర్‌ బస్‌స్టేషన్‌లో దిగిన  ఆ మహిళ మురికివాడలోకి వెళ్లింది. అయితే స్థానిక పోలీసుల సహాయంతో  అక్కడ వెదికారు. అయితే  అక్కడ ఆ మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. మరోవైపు సీసీటీవి పుటేజీ ఆధారంగా 

ఆటోలో ఆ మహిళ వెళ్లిన విషయాన్ని గుర్తించారు పోలీసులు. ఆటో నెంబర్ సీసీటీవి పుటేజీలో లభ్యం కాలేదు. కానీ, ఐదు ఆటోలను గుర్తించి విచారిస్తే ఓ ఆటో డ్రైవర్ తాను మహిళను తీసుకెళ్లినట్టు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాడు.

ఈ సమాచారం ఆధారంగా విచారిస్తే మహిళ ప్రభుత్వాసుపత్రిలో పసికందును వదిలేసి వెళ్లినట్టు గుర్తించారు.ఈ సమాచారాన్ని తెలుసుకొన్న బేగంబజార్  పోలీసులు బీదర్  ప్రభుత్వాసుపత్రికి చేరుకొని పసిపాపను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది.

పసిపాపను వైద్యులు పరీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్లు పరీక్షించారు. పసిపాప తండ్రితో పాటు వైద్యులను బీదర్ కు పంపుతున్నారు. పసిపాప ఉన్న ప్రాంతాన్ని వీడియో కాల్ సహయంతో తల్లితో బీదర్ ఆసుపత్రి వద్ద ఉన్న పోలీసులు మాట్లాడించారు. దీంతో పసిపాప తల్లి మనసు కుదుటపడింది.తన కూతురు ఆచూకీ లభ్యం కావడం పట్ల తల్లి విజయం సంతోషాన్ని వ్యక్తం చేసింది.


 

loader