టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన నలుగురు ఎన్ఆర్ఐలు


టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసును సిట్  బృందం  లోతుగా  విచారణ  చేస్తుంది.  గత ఏడాది అక్టోబర్  నుండి  నిర్వహించిన పరీక్షల క్వశ్చన్ పేపర్లు   లీకయ్యాయా  అనే కోణంలో సిట్  విచారిస్తుంది. 

SIT  Found  Key information  on  TSPSC  question  Paper  leak Case lns

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షను  నలుగురు  ఎన్ఆర్ఐలు  కూడా  రాసినట్టుగా  సిట్ అధికారులు గుర్తించారు. ఈ నలుగురు ఎన్ఆర్ఐలతో   సిట్  అధికారులు  ఫోన్ లో  మాట్లాడారు. 

తెలంగాణ పబ్లిక్  సర్వీస్ కమిషన్  ప్రశ్నాపత్రం లీక్ కేసును  సిట్  లోతుగా దర్యాప్తు  చేస్తుంది. పేపర్ లీక్  కేసులో  కస్టడీలోకి తీసుకున్న 9 మంది నిందితులను  సిట్ బృందం  విచారిస్తుంది.  ఇవాళ  నాలుగో రోజున  సిట్  అధికారులు  నిందితులను  విచారిస్తున్నారు.

గ్రూప్-1  ప్రిలిమ్స్   పరీక్షకు  చెందిన  ప్రశ్నాపత్రం ఎవరెవరికి  ఇచ్చారనే దానిపై  సిట్ బృందం  విచారిస్తుంది. గ్రూప్-1  ప్రిలిమ్స్ పరీక్ష  గత  ఏడాది  అక్టోబర్ మాసంలో  నిర్వహించారు.  అక్టోబర్ లో  నిర్వహించిన పరీక్షకు సుమారు  రెండులక్షలకు పైగా  అభ్యర్ధులు  హాజరయ్యారు. ఈ  ఏడాది  జూన్ మాసంలో  గ్రూప్-1 మెయిన్స్  పరీక్ష  నిర్వహించాల్సి  ఉంది. 

గ్రూప్-1  ప్రిలిమ్స్  పరీక్షలో   వంద మార్కులు  పొందిన  వారి జాబితాను సిట్  అధికారులు తీసుకున్నారు. ఈ జాబితా  ఆధారంగా  సిట్  బృందం  విచారణ  చేయనున్నారు.  

టీఎస్‌పీఎస్‌సీ కి  చెందిన ఏఈ ప్రశ్నాపత్రాన్ని ప్రవీణ్ కు తెలియకుండా రేణుక  కొందరికి  విక్రయించిందని సిట్  బృందం  గుర్తించింది.  టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం  కొనుగోలు  చేసిన వారిని గుర్తించి  సిట్  బృందం  కేసులు  నమోదు  చేసే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్‌సీ సర్వర్, యూజర్ ఐడీ  పాస్ వర్డ్ పై సిట్ దర్యాప్తు  చేయనుంది.  

గత ఏడాది నుండి  జరిగిన  అన్ని పరీక్షలకు  చెందిన  ప్రశ్నాపత్రాలు లీకయ్యాయా  అనే  విషయమై  సిట్ బృందం  విచారణ  చేస్తుంది. ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ ఇంట్లో  సిట్ అధికారులు   తనిఖీలు నిర్వహించారు.  టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా  విచారణ  చేస్తున్నారు. 

టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం  లీక్  కేసులో  విమర్శలు  చేసిన  రాజకీయ నేతలకు   సిట్  నోటీసులు జారీ  చేసింది.  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డికి  సిట్  నిన్న  నోటీసులు పంపారు.  హైద్రాబాద్ లోని  రేవంత్ రెడ్డి  నివాసానికి  సిట్  అధికారులు నోటీసులు అంటించారు.

also read:హైకోర్టులో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పేపర్ లీక్  కేసులో  అరెస్టైన   రాజశేఖర్ స్వగ్రామంలో  కూడా  సిట్  బృందం  దర్యాప్తు  చేస్తుంది.  
పేపర్ ఎలా లీకైంది, నిందితులు  ఎవరెవరరికి   ఈ పేపర్లను  అందించారనే విషయమై  సిట్  విచారణ  చేస్తుంది. మరో వైపు  నిందితులతో  సీన్  రీ కన్ స్ట్రక్షన్  చేస్తున్నారు.  వారం రోజుల పాటు  నిందితులను  కస్టడీకి  కోర్టు  ఇచ్చింది .

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios