హైకోర్టులో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్..

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు తెలంగాణలో సంచలనం రేపింది. ఈ కేసులో రాజశేఖర్ ప్రధాన నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా, అతని భార్య సుచరిత హైకోర్టులో పిటిషన్ వేశారు. 

Petition of TSPSC Paper Leak Accused Rajasekhar's wife Sucharita in High Court, telangana - bsb

హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ  పేపర్ లీకేజీ కేసులో నిందితుడు రాజశేఖర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అతనిని నేరం ఒప్పుకోవాలని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారంటూ రాజశేఖర్ భార్య సుచరిత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో ఆమె ‘పోలీసులు ఈనెల 11న నా భర్తను అరెస్టు చేశారు. కానీ 14వ తేదీ వరకు రిమాండ్ చేయలేదు. నా భర్తను నేరం ఒప్పుకోమని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టిన నా భర్తను చూసి నేను దిగ్భ్రాంతి చెందాను. 

మీడియా సమావేశం తర్వాత వెళ్లేప్పుడు నా భర్త రాజశేఖర్ కుంటుతున్నాడు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లనే నా భర్తకు ఆ పరిస్థితి వచ్చింది. నా భర్త రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు  ఆయనను ఆసుపత్రిలో చేర్చాలి. రాజశేఖర్ ను సిట్ విచారణ చేస్తున్న వీడియోను బయటపెట్టాలి. కస్టడీలో పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. దీనిమీద,  పేపర్ లీక్ పై స్వతంత్ర దర్యాప్తు సంస్థ లేదా స్వతంత్ర కమిషన్ తో విచారణ చేయించాలి.  నా భర్త రాజశేఖర్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి’ అని  అందులో పేర్కొన్నారు.

జూనియర్ లెక్చరర్ పరీక్షలు: టీఎస్‌పీఎస్‌సీకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం

ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  డిజిపి, హైదరాబాద్ నగర డిసిపిలు, సిట్ లను ఆమె చేర్చారు. కాగా, హైకోర్టు ఆమె పిటిషన్ను విచారించింది.  మద్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. కేసు విచారణ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు తెలిపింది. 

తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుడు రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఉన్న బంధువులతో కలిసి రాజశేఖర్ రెడ్డి గ్రూప్-1 రాశాడు. విదేశాల నుంచి ఇద్దరు బంధువులను తీసుకొచ్చి గ్రూప్-1 పరీక్షకు హాజరయ్యాడు. అక్కడ పనిచేస్తున్న దంపతులు ఇక్కడికి వచ్చి పరీక్ష రాయడం వారి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చర్చనీయాంశంగా మారింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios