టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్‌లో కీలక పరిణామం: బోర్డు సభ్యులను విచారించనున్న సిట్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ లో  సిట్  కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ కేసును మరింత లోతుగా  దర్యాప్తు  చేయనుంది. 

SIT  Decides To  Probe  TSPSC  Board  Members lns


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసు దర్యాప్తు విషయమై  సిట్ కీలక నిర్ణయం తీసుకుంది.   టీఎస్‌పీఎస్‌సీ   బోర్డు సభ్యులను  విచారించాలని  సిట్  నిర్ణయం భావిస్తుంది.   తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు  చెందిన ఏడుగురు సభ్యుల  స్టేట్ మెంట్లను  రికార్డు  చేయనుంది  సిట్ . 

గత వారంలో  అరెస్టైన  రమేష్  టీఎస్‌పీఎస్‌సీ బోర్డు సభ్యుడు లింగారెడ్డి వద్ద పీఏగా  పనిచేస్తున్నట్టుగా సిట్ గుర్తించింది. ఈ కేసులో అరెస్టైన  ప్రవీణ్ టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ వద్ద పీఏగా  పనిచేస్తున్నాడు. 

 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్   లో  పేపర్ లీక్ అంశాన్ని  మరింత లోతుగా దర్యాప్తు  చేయాలని  సిట్  భావిస్తుంది.  ఈ కేసులో  13 మందిని అరెస్ట్  చేశారు.   అరెస్టైన వారిలో  మరికొందరిని   సిట్  బృందం  కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.  ప్రస్తుతం  సిట్  కస్టడీలోనే  రమేష్ ఉన్నాడు. గత  వారంలో  రమేష్, సురేష్, షమీమ్ లను  సిట్  బృందం  అరెస్ట్  చేసింది.

ఈ నెల  మొదటి వారంలో  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశం  వెలుగు చూసింది.  తొలుత  టీఎస్‌పీఎస్‌సీలో కంప్యూటర్లు  హ్యాక్ అయ్యాయని  అనుమానించారు. అయితే  పోలీసుల విచారణలో  కంప్యూటర్లు  హ్యాక్ కాలేదని  గుర్తించారు.  పేపర్ లీక్ అయిందని  పోలీసులు గుర్తించారు. ఈ నెల  12, 15, 16 తేదీల్లో  జరగాల్సిన  పరీక్షలను వాయిదా వేశారు. అయితే  ఈ నెల  5న  జరిగిన  ఏఈ ప్రశ్నాపత్రం లీక్ అయినట్టుగా  గుర్తించి ఈ పరీక్షను రద్దు  చేశారు.   ఈ కేసులో  తొలుత  9 మందిని అరెస్ట్  చేశారు. ఆ తర్వాత   నలుగురిని అరెస్ట్  చేశారు.

also read:టీఎస్‌పీఎస్‌సీ ముట్టడిలో ఉద్రిక్తత: వైఎస్ షర్మిలకు అస్వస్థత

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ అంశం  తెరమీదికి రావడంతో   కొన్ని పరీక్షలను  రద్దు చేయగా, మరికొన్ని  పరీక్షలను  వాయిదా వేశారు. వాయిదా వేసిన  పరీక్షలకు సంబంధించి న షెడ్యూల్ ను  రెండు రోజుల క్రితం  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ మాసం నుండే  టీఎస్‌పీఎస్‌సీలో  పేపర్ లీక్ అవుతున్నాయనే ప్రచారం కూడా లేకపోోలేదు.ఈ విషయమై  సిట్ బృందం  దృష్టి కేంద్రీకరించింది. పేపర్ లీక్  అంశంపై  బోర్డు సభ్యులు,  అధికారుల  నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా  సిట్  దర్యాప్తు  నిర్వహించే అవకాశం లేకపోలేదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios