టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్  కేసులో  మరో కీలక పరిణామం  చోటు  చేసుకుంది.  ఏఈఈ   పరీక్షలో ఎలక్ట్రానిక్ డివైజ్ తో  పరీక్షలు  రాసిన  ముగ్గురిని  సిట్  అరెస్ట్  చేసింది. 

హైదరాబాద్: టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఈఈ పరీక్షలో ఎలక్ట్రానిక్ డివైజ్ ఉపయోగించిన ముగ్గురిని సోమవారంనాడు అరెస్ట్ చేసింది సిట్ . వరంగల్ జిల్లాకు చెందిన డీఈ రమేష్ ద్వారా ఈ ముగ్గురు నిందితులు ఏఈఈ పేపర్ కొనుగోలు చేసినట్టుగా సిట్ గుర్తించింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో డీఈ రమేష్ ను ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే 43 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ ముగ్గురి అరెస్టుతో అరెస్టుల సంఖ్య 46కి చేరింది. 

టీఎస్‌పీఎస్‌సీలో ఈ ఏడాది మార్చి 12, 15, 16 తేదీల్లో జరగాల్సిన రెండు పరీక్షలను రద్దు చేశారు. మార్చి 12న టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్, మార్చి 15, 16 తేదీల్లో అసిస్టెంట్ సివిల్ సర్జన్ నియామాకాల పరీక్షలను తొలుత టీఎస్‌పీఎస్ సీ వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని తొలుత భావించారు. కానీ టీఎస్‌పీఎస్ సీ పేపర్ లీక్ అయిందని ఆ తర్వాత గుర్తించారు పోలీసులు. ఈ ఏడాది మార్చి 5న జరిగిన ఏఈఈ పరీక్ష పేపర్ లీక్ అయిందని అధికాారులు గుర్తించారు . ఈ కేసు విచారణను సిట్ కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం . ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సిట్ బృందం విచారణ నిర్వహిస్తుంది. 

టీఎస్‌పీఎస్‌సీలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. క్వశ్చన్ పేపర్లు విక్రయించిన వారితో పాటు పేపర్లు కొనుగోలు చేసిన వారిని కూడ సిట్ బృందం అరెస్ట్ చేసింది. వరంగల్ జిల్లాలో అరెస్ట్ చేసిన డీఈ రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు
ప్రశాంత్, నవీన్, మహేష్ లను సిట్ ఇవాళ అరెస్ట్ చేసింది.