Asianet News TeluguAsianet News Telugu

Disha Encounter Case : దిశ నిందితుల్లో ఎవ్వరూ మైనర్లు లేరు ! సిర్పుర్కర్ కమిషన్ విచారణలో షాకింగ్ విషయాలు....

నిందితులు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని,  కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.  Shad Nagar Toll Gate ప్రాంతంలో నిలిచి ఉన్న యువతిని బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి,  ఆ తర్వాత హతమార్చిన ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 

Sirpurkar Commission Inquiry Committee on disha encounter case update
Author
Hyderabad, First Published Nov 23, 2021, 4:30 PM IST

రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన దిశ కేసులో విచారణ కమిటీ నివేదిక సిద్దం చేసింది. దిశా నిందితుల్లో ఎవరూ మైనర్లు లేరని ఏసిపి సురేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కీర్తి కిరణ్ కోటా పేర్కొన్నారు. వారికి సంబంధించిన రికార్డులు అన్నింటిలోనూ మేజర్లే ఉన్నట్లు వెల్లడించారు.  దిశ నిందితుల Encounter పై విచారణకు నియమించిన  సిర్పూర్కర్ కమిషన్ ఎదుట  సోమవారం ఆయన వాదనలు వినిపించారు.

నిందితులు మైనర్లు అని చెప్పేందుకు చాలా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని,  కొన్ని చోట్ల ఇంకుతో దిద్దినట్లు కూడా ఉందని, ఈ విషయాన్ని గమనించాలని అన్నారు.  Shad Nagar Toll Gate ప్రాంతంలో నిలిచి ఉన్న యువతిని బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి,  ఆ తర్వాత హతమార్చిన ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 

ఆ తర్వాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి తరలిస్తుండగా తప్పించుకునే ప్రయత్నంలో.. పోలీసులకు నిందితులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు అని పోలీసులు తెలిపారు. అయితే, నిందితులు కాల్పులు జరపడంతో గత్యంతరం లేని స్థితిలోనే  పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది  అన్నారు.

ప్రభుత్వ న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదిస్తూ rape and murder జరిగినప్పుడు నుంచి ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు.  వారిని అరెస్టు చేసినప్పుడు  షాద్నగర్ పోలీస్ స్టేషన్ కు  40 వేల మంది ప్రజలు చేరుకున్నారని,  నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారన్నారు.  చివరికి చర్లపల్లి జైలుకు తరలించినప్పుడు కూడా అక్కడికి జనం చేరుకున్నారని అందుకే వారికి హాని కలగకూడదనే ఉద్దేశంతో నే సేఫ్ హౌస్లో ఉంచారని కమిషన్కు తెలిపారు.  

ప్రజల దృష్టిలో పడకూడదనే ఆలోచనతోనే తెల్లవారుజామున నేరస్థలానికి తీసుకెళ్లామని తెలిపారు.  సాక్షులు, లారీ యజమాని చెప్పిన వివరాల ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అనంతరం విచారణ మంగళవారానికి వాయిదా పడింది. 

ఇదిలా ఉండగా, నవంబర్ 16న దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ బూటకపు ఎన్‌కౌంటరేనని మృతుల తరపు న్యాయవాది Sirpurkar Commission ముందు వాదించారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై  సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ ఎన్ కౌంటర్ పై కమిషన్ విచారణ నిర్వహిస్తుంది. నవంబర్ 16న ఎన్ కౌంటర్ లో మరణించిన మృతుల కుటుంబ సభ్యులు విచారణకు హాజరయ్యారు. బాధిత కుటుంబ సభ్యుల తరపున న్యాయవాది వాదించారు.

ఈ ఎన్‌కౌంటర్ లో మరణించిన వారిలో ముగ్గురు మైనర్లే ఉన్నారని మృతుల కుటుంబ సభ్యుల తరపు న్యాయవాది సిర్పూర్కర్ కమిషన్ ముందుంచారు. అయితే నిందితుల్లో ముగ్గురు మైనర్లే ఉన్నా వారిని Juvenile Homeకు తరలించకుండా చర్లపల్లి జైలుకు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. ఇది ముమ్మూటికీ బూటకపు ఎన్‌కౌంటరే అని ఆయన కమిషన్ ముందు వాదించారు.

2019 నవంబర్ 27వ తేదీన  disha పై నలుగురు నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. మృతదేహన్ని షాద్‌నగర్ కు సమీపంలో చటాన్‌పల్లి వద్ద ఆమె మృతదేహన్ని దగ్దం చేశారు. దిశపై అత్యాచారం చేసిన నిందితులను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు గా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటనకు సంబంధించి దిశ నిందితులతో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది. 2019 డిసెంబర్ 6వ తేదీన చటాన్‌పల్లి వద్ద నిందితులు encounter లో మరణించారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో తమపై దాడి చేసి కాల్పులకు దిగారని పోలీసులు తెలిపారు. 

ఈ ఎన్‌కౌంటర్ లో నలుగురు నిందితులు మరణించారు. అయితే ఈ నలుగురి ఎన్‌కౌంటర్ బూటకమని హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు sirpurkar commission ను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా సిర్పూర్కర్ కమిషన్ విచారణ ఆలస్యమైంది. సిర్పూర్కర్ కమిషన్ హైద్రాబాద్ వేదికగా చేసుకొని విచారణను వేగవంతం చేసింది.

గత మాసంలో ఈ ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ అధికారుల నుండి సిర్పూర్కర్ కమిషన్ విచారణ నిర్వహించింది.ఈ ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ తో పాటు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డితో పాటు ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను కమిషన్ విచారణ నిర్వహించింది.ఈ ఎన్‌కౌంటర్ బూటకమని పౌరహక్కుల సంఘం నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.

ఎన్ కౌంటర్ సమయంలో నిందితులపై కాల్పులు జరపాలని ఎవరు ఆదేశాలు జారీ చేశారని కూడా సిర్పూర్కర్ కమిషన్ ముందు హాజరైన ఏసీపీ సురేందర్ ను ప్రశ్నించింది.  కమిషన్ ముందు ఐపీఎస్ అధికారి సజ్జనార్ రెండు దఫాలు హాజరయ్యారు. ఎన్ కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులను ఏసీపీ సురేందర్ కమిషన్ కు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios