Asianet News TeluguAsianet News Telugu

కరోనాకి మందు నా దగ్గర ఉంది.. తెలంగాణలో కూడా ఆనందయ్య..!

కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ప్రజలకు ఆయుర్వేద మందు పంచుతున్న సంగతి తెలిసిందే. ఆ మందు బాగా పనిచేస్తోందని చాలా మంది అక్కడ క్యూలు కూడా కట్టారు.

Singareni retired employee sensational Comments on Corona medicine
Author
Hyderabad, First Published May 27, 2021, 8:51 AM IST

కరోనా మహమ్మారికి విరుగుడు అంటూ.. కృష్ణపట్నంలో ఆనందయ్య అనే వ్యక్తి ప్రజలకు ఆయుర్వేద మందు పంచుతున్న సంగతి తెలిసిందే. ఆ మందు బాగా పనిచేస్తోందని చాలా మంది అక్కడ క్యూలు కూడా కట్టారు. అయితే.. ఆ మందుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో... దానిని పంపిణీ నిలిపివేశారు. ఆ మందు నిజంగా పనిచేస్తుందో లేదో.. పరిశోధనలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కరోనాకి మందు నా దగ్గర ఉందని.. రెండు గంటల్లో కరోనా రోగులను నయం చేస్తానంటూ మరో వ్యక్తి బయలుదేరాడు.

‘ప్రభుత్వం అనుమతిస్తే కరోనా బాధితున్ని రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు మూడొందల మందిని నయం చేశా’అని మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు బచ్చలి భీమయ్య పేర్కొంటున్నాడు. ఆయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.

పట్టణంలోని మారుతినగర్‌లో నివాసం ఉంటున్న భీమయ్య.. తన తాత దగ్గర వనమూలికల వైద్యం గురించి తెలుసుకున్నానని చెప్పాడు. దగ్గు, దమ్ము ఊపిరితిత్తుల సమస్యలకు 13 రకాల వన మూలికలతో తయారుచేసిన మందు కరోనా బాధితులకు బాగా పనిచేస్తుందని, రెండు గంటల్లో నయం అవుతుందని పేర్కొన్నాడు. ఉచితంగానే ఈ మందు అందిస్తున్నానని తెలిపాడు. కాగా, భీమయ్య అందించే మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని మందమర్రి సీఐ ప్రమోద్‌రావు చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోవద్దని సీఐ కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios