విశాఖకు సింగరేణి అధికారులు: ఈఓఐ సాధ్యాసాధ్యాలపై పరిశీలన
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈఓఐ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సింగరేణి అధికారులు పరిశీలిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమై మూలధన వ్యయం కోసం ఈఓఐని ఆహ్వానించింది ఆర్ఐఎన్ఎల్.
విశాఖపట్టణం:విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈఓఐ సాధ్యాసాధ్యాల పరిశీలనకు సింగరేణి అధికారులు మంగళవారంనాడు విశాఖపట్టణం చేరుకున్నారు. ఫ్యాక్టరీ నిర్వహణకు అవసరమైన మూలధన నిధులిచ్చి నిబంధనల మేరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తును కొనుగోలు చేసేందుకు ఆర్ఐఎన్ఎల్ ఈఓఐను ఆహ్వానించింది.
దీంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్ లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈఓఐ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సింగరేణి అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దీంతో ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు, ఇద్దరు జీఎంలు ఇవాళ విశాఖపట్టణానికి చేరుకున్నారువిశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి చెందిన అధికారులతో సింగరేణికి చెందిన ముగ్గురు డైరెక్టర్లు, ఇద్దరు జీఎంలు చర్చిస్తున్నారు. సింగరేణి సంస్థలో తెలంగాణ ప్రభుత్వం వాటా 51 శాతం , కేంద్ర ప్రభుత్వానిది 49 శాతం,. దీంతో సింగరేణి నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వందే పైచేయిగా ఉండనుంది.
ఇవాళ విశాఖపట్టణానికి చేరుకన్న సింగరేణి అధికారులు ఈఓఐ పై స్టీల్ ప్లాంట్ అధికారులతో చర్చిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ వివరాలను సింగరేణి అధికారులుతెలుసుకుంటున్నారు. మార్కెటింగ్ డివిజన్ అధికారులతో సింగరేణి అధికారుల భేటీఅయ్యారు. రేపు ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ అమిత్ భట్ తో సింగరేణి అధికారులు భేటీ కానున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈఓఐపై ఈ నెల 15వ తేదీ వరకు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అయితే ఇప్పటికే ఆరు సంస్థలు బిడ్డింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఏడో సంస్థగా సింగరేణి డైరెక్టర్లు విశాఖపట్టణానికి చేరుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలు కోరుతున్నారు..
సింగరేణి సంస్థ ప్రతినిధులతో కూడా స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలు భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలే బిడ్డింగ్ లో పాల్గొనేలా అవకాశం కల్పించాలని పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను బీజేపీ, వైసీపీ సహా అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమయంలో ఈఓఐపై సింగరేణి సంస్థ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అధికారులతో చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుందిజ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఈఈ విషయమై మోడీ సర్కార్ తీరుపై కేసీఆర్ గతంలో తీవ్ర విమరశలు చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అవసరమైతే కొనుగోలుకు కూడా వెనుకాడబోమని ఆయన ప్రకటించారు.
also read:సమీపంలోని బయ్యారంకు కుదరదు.. కానీ 1800 కి.మీ దూరంలోని ముంద్రాకు ఎలా సాధ్యం?: కేటీఆర్
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించాలని భావిస్తున్నిరు కేసీఆర్ . విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈఓఐ అంశాన్ని ఆసరాగా చేసుకొని కేసీఆర్ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.