న్యూఇయర్ కావడంతో అధికారులు రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ సంస్థ గోడౌన్‌నే బార్‌గా మార్చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌లో అధికారులు పార్టీ చేసుకున్నారు.

మిల్లర్లతో కలిసి ప్రభుత్వ కార్యాలయంలో గురువారం మందు పార్టీ ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా రాత్రికి కూడా పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ విషయం మీడియాకు పొక్కడంతో అధికారులు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.