Asianet News TeluguAsianet News Telugu

సిద్ధార్థ కేసు : టీఆర్ఎస్ నాయకుడి బంధువును ప్రేమించాడని.. పరువు హత్య.. ?

తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన కమ్మర్ పల్లి మండలం హాసకొత్తూరుకు చెందిన యువకుడు సిద్ధార్థ్ ది పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనక రాజేష్ సంబంధీకులతో సిద్ధార్థ ప్రేమ వ్యవహారం నడిపించడమే ఈ హత్యకు దారి తీసిన ఉండవచ్చని అంటున్నారు.

siddarth murder case : love affair caused to death in nizamabad - bsb
Author
Hyderabad, First Published May 22, 2021, 1:23 PM IST

తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన కమ్మర్ పల్లి మండలం హాసకొత్తూరుకు చెందిన యువకుడు సిద్ధార్థ్ ది పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కనక రాజేష్ సంబంధీకులతో సిద్ధార్థ ప్రేమ వ్యవహారం నడిపించడమే ఈ హత్యకు దారి తీసిన ఉండవచ్చని అంటున్నారు.

కొన్ని రోజుల నుంచి యువతితో వాట్సాప్ చాటింగ్, ఫోన్లో మాట్లాడటం జీర్ణించుకోలేకనే సిద్ధార్థ పై దాడి చేసి ఉంటారని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు సిద్ధార్థను తీసుకు వెళ్ళి తీవ్రంగా చితకబాదారని అనుమానిస్తున్నారు.

సిద్ధార్థ ఎక్కువ మంది దాడి చేసి, తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా వైద్యం కోసం ప్రధాన నిందితుడు ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సిద్ధార్థను రాజేష్ గతంలోనే హెచ్చరించడాని బట్టి పరువు హత్యగానే వెల్లడవుతుంది. 

 ఇదిలా ఉండగా సిద్ధార్థ హత్య కేసులో పోలీసులు నిందితులకు కల్పించిన రాచమర్యాదల తీరుతోనే హాసకొత్తూరులో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గురువారం మృతుని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. పోలీస్స్టేషన్కు తరలించారు.

అయితే పోలీస్ స్టేషన్ లో నిందితులు భోజనాలు చేస్తున్న ఫొటోలను వాట్సప్ స్టేటస్ లో పెట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇది చూసిన గ్రామస్తులు నిందితులకు, పోలీసులు రాచమర్యాదలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఆందోళనకు పూనుకున్నారు.

పోలీసులు వాహనాల అద్దాలు పగలగొట్టారు. మోహరించిన పోలీసు బలగాలను, అధికారులను గ్రామం బయటికి పంపించేశారు. నిందితుడు కనక రాజేశ్‌ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. 

కాగా, నిజామాబాద్ జిల్లా, కమ్మర్‌పల్లి మండలంలోని హాసాకొత్తూరు లో గురువారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ బాలుడు దారుణ హత్యకు గురవడం, అనుమానితుడి ఇంటిని వందలాది మంది ముట్టడించడం, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... హాసాకొత్తూరు మారుతీ నగర్ లో నివాసముండే మాలవత్ శ్రీనివాస్, సరోజా దంపతులకు ఇద్దరు కుమారులు కృష్ణ, సిద్ధార్థ (17) ఉన్నారు.

ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ కదలలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాడు. సరోజా వ్యవసాయ కూలీ, కాగా పెద్ద కొడుకు చదువుకుంటున్నాడు. చిన్న కొడుకు సిద్ధార్థ హార్వెస్టర్ క్లీనర్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు.

బాలుడి హత్య : టీఆర్ఎస్ నాయకుడి ఇంటి ముట్టడి, గ్రామంలో ఉద్రిక్తత, అరెస్ట్.....

ఇలా ఉండగా, బుధవారం రాత్రి సిద్ధార్థను అతని స్నేహితుడు నరేందర్ వచ్చి మెదక్ వెళ్లాల్సి ఉందని చెప్పి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో సిద్ధార్థ కు వరుసకు మామ అయిన వసంత్, అన్న కృష్ణ లకు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కనక రాజేష్ ఫోన్ చేశాడు.  సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని చెప్పాడు.

అంతేకాదు, అంత్యక్రియల నిమిత్తం గండి హనుమాన్ ప్రాంతానికి రమ్మని తెలిపాడు. దీంతో కృష్ణ, వసంత్ తోపాటు రవి, స్వామి అక్కడకు వెళ్లగా, ఎవరూ లేరు. మరోవైపు సిద్ధార్థ్ గురించి నరేందర్ అడిగితే రాత్రి భోజనం చేశామని, కొద్దిసేపటికి సిద్ధార్థ కు ఫోన్ రాగా బయటకు వెళ్లాడు అని తెలిపాడు.

మరోవైపు గండి హనుమాన్ వద్ద మృతదేహం ఉందని చెప్పినప్పటికీ, అక్కడ లేకపోవడం, ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీ గదిలో మృతదేహం తేలడం అంతా సినీ ఫక్కీలో జరిగిపోయింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు  తెలియగా, వారు మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా, శరీరంపై గాయాలు కనిపించాయి. కట్టెలతో కొట్టి చంపేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios