ఎట్టకేలకు దిగివచ్చిన పోలీసులు పెద్దలు సదరు మహిళా  సీఐపై చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది. 

‘ఆక్యుపై ధర్నా చౌక్’ లో భాగంగా నిన్న ఇందిరా పార్కు వద్ద ప్రజాసంఘాలు చేపట్టిన ఆందోళన రణరంగంగా మారిన విషయం తెలిసిందే.

అయితే ప్రజా సంఘాల ధర్నాకు వ్యతిరేకంగా స్థానికుల ముసుగులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, పోలీసులు.. ప్రజాసంఘాల నేతలపై విరుచకపడ్డారు.

లేక్ వ్యూ పోలీసు సీఐగా పనిచేస్తున్న శ్రీదేవి సివిల్ డ్రెస్సులో అక్కడికి వచ్చి ప్లకార్డులు పట్టుకొని స్థానికురాలిగా నినాదాలు చేశారు.

అయితే సోషల్ మీడియా పుణ్యాన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల తీరుపై ప్రజాసంఘాలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి.

దీనిపై ఎట్టకేలకు దిగివచ్చిన పోలీసులు పెద్దలు సదరు మహిళా సీఐపై చర్యలు తీసుకోడానికి సిద్ధమైంది.

ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ విచారణకు ఆదేశించారు. అప్పటి వరకు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.