తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఎస్ ఐ పోస్టుల నియామకానికి సంబంధించిన తుది పరీక్ష  ఈ రోజు ప్రారంభమైంది.

 

పోలీసు శాఖలో సబ్‌ ఇన్ స్పెక్టర్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్ ఫోర్స్‌ (ఎస్పీఎఫ్‌)లో ఎస్సై (మెన్స్), అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఎఫ్‌ఓ) పోస్టులతోపాటు ఎస్సై (కమ్యూనికేషన్/ పీటీఓ) పోస్టులకు నేడు పరీక్ష లు నిర్వహిస్తున్నారు.

 

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఫస్ట్ పేపర్ పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వారు నిర్వహించనున్నారు.

దేహదారుఢ్య పరీక్షల్లో నెగ్గి తుది రాత పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు హాల్‌టిక్కెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ ముగిసింది.

 

రేపు ఉదయం ఇంగ్లీష్ పేపర్, మధ్యాహ్నం తెలుగు పేపర్ పరీక్షలు నిర్వహించనున్నారు.