Asianet News TeluguAsianet News Telugu

నాగచైతన్యను హత్య చేసింది ప్రియుడే.. తప్పించుకోవడానికే కత్తిపోట్ల నాటకం...

ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో నాగ చైతన్య nurse గా పనిచేస్తుంది.  అక్కడే కోటిరెడ్డి మేనేజర్ గా పని చేసేవాడు.  వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.  నాగచైతన్య తనను వివాహం చేసుకోవలసిందిగా కోటిరెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చింది.  దీంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోటిరెడ్డి ప్లాన్ వేశాడు. 

shocking twist in young couple committed suicide at a lodge in Hyderabad
Author
Hyderabad, First Published Oct 27, 2021, 11:44 AM IST

చందానగర్ : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీన యువతి ఆత్మహత్య కేసులో అనేక విషయాలు బయట పడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవిడికి చెందిన నాగ చైతన్య 24 ఆదివారం హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రియుడు గుంటూరు జిల్లా  రెంటచింతలకు చెందిన కోటిరెడ్డి (29) ప్రియురాలిని హత్య చేసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడు.

కేసును క్షుణ్ణంగా పరిశీలించిన policeలకు అనేక విషయాలు తెలిశాయి. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో నాగ చైతన్య nurse గా పనిచేస్తుంది.  అక్కడే కోటిరెడ్డి మేనేజర్ గా పని చేసేవాడు.  వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.  నాగచైతన్య తనను వివాహం చేసుకోవలసిందిగా కోటిరెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చింది.  దీంతో ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కోటిరెడ్డి ప్లాన్ వేశాడు. 

23వ తేదీ  ఉదయం సాయంత్రం వరకు అక్కడే ఉండి నాగ చైతన్యను ఎస్ వీఆర్ గ్రాండ్ హోటల్ లో ని Oyo Room కి తీసుకు వెళ్ళాడు. రాత్రి అక్కడే బస చేసిన అతను స్విగ్గి లో ఇద్దరికి భోజనం చేశాడు 24వ తేదీ ఉదయం 11 గంటలకు హోటల్ గదికి తాళం వేసి బయటకు వెళ్ళిపోయాడు రాత్రి పదిన్నర గంటల సమయంలో Ongole లోని ఓ ఆసుపత్రిలో చేరారు. 

అతను నాగ చైతన్యను Murder చేసి ట్రైన్లో ఒంగోలు కు చేరుకున్నట్లు తెలిసింది.  ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా నాగచైతన్య రక్తపుమడుగులో మృతి చెంది ఉంది.

లాడ్డిలో రక్తపుమడుగులో ప్రియురాలు.. ఆస్పత్రిలో కత్తిగాట్లతో ప్రియుడు.. మిస్టరీ ఏంటంటే..

కత్తి, తాడు కొనుగోలు
 23న నగరానికి వచ్చిన కోటిరెడ్డి ఓ సూపర్ మార్కెట్ లో  Sword, rope కొనుగోలు చేశాడు.  నాగచైతన్యను ఓయో రూమ్ కి తీసుకు వెళ్లిన కోటిరెడ్డి ముందుగానే వోడ్కా బాటిల్,  కత్తి, తాడులను  తన బ్యాగులో తీసుకు వెళ్ళాడు.  రూమ్ కి వెళ్ళిన కొద్దిసేపటికే బయటకు వెళ్లి  కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు.

Swiggyలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. స్విగ్గీ బాయ్ నుంచి ఫుడ్ డెలివరీ తీసుకున్న తన రూంలోకి వెళ్లి మరుసటిరోజు ఉదయం వరకు బయటకు రాలేదు. రాత్రి ఇద్దరూ Vodka సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 
తరువాత Marriage విషయంలో  ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఉంటుందని,  అని ఆ క్రమంలోనే ప్రియురాలిని కత్తితో  గొంతు కోసి హత్య చేసి ఉంటాడని ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత ఫ్యాన్ కు ఉరి వేసేందుకు చున్నీతో ప్రయత్నించి ఉంటాడని పోలీసులు వెల్లడించారు. 

కులాంతరమే హత్యకు కారణమా? 
కోటి రెడ్డి సామాజిక వర్గం,  నాగ చైతన్య సామాజిక వర్గాలు వేర్వేరు కావడం వల్లే నాగచైతన్య పెళ్లి చేసుకునేందుకు అతని కుటుంబ సభ్యులు నిరాకరించి ఉంటారని తెలుస్తోంది. 

దళిత కులానికి చెందిన యువతి కావడంతో కోటిరెడ్డి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఒంగోలు కు వెళ్లిన సిటీ పోలీసులు అతనిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios