రేవంత్ రెడ్డి ఇలాకాలో భారీ షాక్ టిఆర్ఎస్ లో చేరేందుకు ముఖ్య అనుచరుల ఏర్పాట్లు చక్రం తిప్పిన రేవంత్ ప్రత్యర్థి గుర్నాథ్ రెడ్డి ఒక జెడ్పీటిసి, ఒక సర్పంచ్ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవచ్చంటూ కథనాలు

తెలంగాణలో హాట్ టాపిక్ గా నిలిచిన రేవంత్ రెడ్డికి ఊహించని భారీ షాక్ తగిలింది. తెలంగాణలో ఇటు టిఆర్ఎస్, అటు టిడిపి లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న రేవంత్ రెడ్డికి మాత్రం తన సొంత నియోజకవర్గంలోనే షాక్ ఇచ్చేందుకు ఆయన ముఖ్య అనుచరులు రెడీ అవుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

కొడంగల్ నియోజకవర్గం మద్దూరులో సమావేశమైన రేవంత్ అనుచరగణం. టిఆర్ఎస్ లో చేరేందుకు కసరత్తు (పైన ఫొటో చూడొచ్చు.)

రేవంత్ నియోజకవర్గమైన కొడంగల్ లో కొందరు నేతలు టిడిపి వీడి టిఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. నియోజకవర్గంలోని మద్దూరు జడ్పీటిసి బాల్ సింగ్ తోపాటు మద్దూరు సర్పంచ్ వెంకటయ్య ఇద్దరు కూడా టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరిని టిఆర్ఎస్ లో చేర్పించేందుకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, రేవంత్ ప్రత్యర్థి గుర్నాథ్ రెడ్డి తెర వెనుక చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. గుర్నాథ్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉండేవాడు. అయితే గత ఎన్నికల సమయంలో ఆయన టిఆర్ఎస్ లో చేరారు. 

రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లాలనుకుంటే తాము కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని వారు అంటున్నారు. వారంతా తాజాగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సుమారు 200 మందికి పైగా హాజరయ్యారు. రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్తే మా దారి మేము చూసుకుంటామని వారు అంటన్నారు. వీరందరూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

ఈరోజే వీరంతా గుర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వచ్చి కేటిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ కండవా కప్పుకుంటారని తెలిసింది. వీరితోపాటు నియోజకవర్గానికి సంబంధించిన మరికొందరు నాయకులు, కార్యకర్తలు, రేవంత్ ముఖ్యమైన అనుచరులు కూడా టిఆర్ఎస్ లో చేరతారంటూ గుర్నాథ్ రెడ్డి తాజాగా ప్రకటించడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు రేవంత్ రెడ్డి షాక్ ఇస్తుంటే ఆయనకు సొంత నియోజకవర్గంలో ముఖ్య అనుచరులే షాక్ ఇస్తున్నారేంటబ్బా అని రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

కేసిఆర్ సర్కారు గొర్రెల పథకంలో వింత అనుభవం చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/hMBFkQ