పాలమూరు టిఆర్ఎస్ కు షాక్

First Published 2, Jan 2018, 8:41 PM IST
Shock to palamuru TRS prominent zptc member joins Congress
Highlights
  • కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరిన పాలమూరు జెడ్పీటిసి
  • పాలమూరు రాజకీయాల్లో హాట్ టాపిక్
  • పాలమూరు ప్రజలను కేసిఆర్ మోసం చేశారని ఉత్తమ్ ఫైర్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి వరకు అన్ని పార్టీల నేతలంతా అధికార టిఆర్ఎస్ పార్టీ గూటికే చేరారు. బలమున్నవాళ్లు.. బలం లేని వారు క్యూ కట్టి మరీ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత మూడున్నరేళ్లుగా  ఈ ఆపరేషన్ ఆకర్ష్ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నది.

కానీ పాలమూరు జిల్లాలో సీన్ రివర్స్ అయింది. పాలమూరు జిల్లాలోని ఒక జెడ్పీటిసి టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో ఈ చేరిక పాలమూరు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మంగ‌ళ‌వారం నాడు గాంధీభ‌వ‌న్‌లో మ‌హ‌బూ్బ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం హన్వాడ మండ‌లం జ‌డ్‌పిటిసి నారాయ‌ణ‌మ్మ, ఆమె కుమారుడు సురేంద‌ర్ రెడ్డిల‌తోపాటు వంద‌లాది మంది టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే ప్ర‌కాశం హాల్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఎంఐఎం మాజీ కార్పోరేట‌ర్ బిలాలతోపాటు వంద‌లాది మంది ఎంఐఎం కార్య‌క‌ర్త‌లు పార్టీలో చేరారు..

ఈ సమావేశాల్లో ఉత్తమ్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే... మహబూబ్ నగర్ జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానం గెల్పించేందుకు ముందుండి నడిపిస్తా. ఒక్క మహబూబ్ నగర్ జిల్లా కాదు యావత్ తెలంగాణను సీఎం కెసిఆర్ మోసం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రారంభించిన విద్యుత్ ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తయి ఫలితాలు ఇస్తున్నాయి. వాటిని టిఆర్ఎస్ చేసినట్లు ఈ సర్కార్ చెప్పుకుంటున్నది. ఈ సర్కార్ లో ఒక్క విద్యుత్ యూనిట్ కూడా ఉత్పత్తికాలేదు. కెసిఆర్ పాల్స్ ప్రసారం చేస్తున్నారు. 2011 లో తక్కువ ఉత్పత్తి అయ్యేది. అప్పుడు కాంగ్రెస్ ముందుచూపుతో పవర్ ప్లాంట్స్ ప్రతిపాదన తీసుకొచ్చింది. తమిళనాడు, మహారాష్ట్ర లలో కూడా కెసిఆర్ వల్లే కరెంట్ సర్ ప్లస్ లో ఉందా...?

2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అందిస్తాం. నిరుద్యోగులకు భృతి కల్పిస్తాం. కాంగ్రెస్ లో చేరిన టీఆరెస్ హన్వాడ జడ్పిటిసి ని అభినందిస్తున్నాను. తెలంగాణాలో టీఆరెస్ కు బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది. కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. నాటి కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన విద్యుత్ ప్రాజెక్టు లతోనే ఇప్పుడు ఉత్పత్తి  వస్తున్నది. కేసీఆర్ తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలి. 24గంటల విద్యుత్ పై పై కేసీఆర్ చెబుతున్నవి పచ్చి అబద్ధాలు. 2019లో కాంగ్రెస్ అధికారం లోకి రావడం ఖాయం.

ఈ కార్యక్రమంలో తెలంగాణ పిసిసి ఇన్ ఛార్జి రామచంద్ర కుంతియా,మాజీ మంత్రి సీనియర్ నేత చిన్నారెడ్డి, ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

loader