Asianet News TeluguAsianet News Telugu

‘ముంబై’ డాన్ ఎవరు...!

శివసేన ప్రాంతీయ వాదంతో మరోసారి  సత్తా చాటింది.

shiv sena ahead bjp in bmc elections

 

ముంబైలో  పెద్ద పులి గర్జించింది. కమలం వికసించింది. విడిపోయి విజయం సాధించినా ఎవరికీ అనుకున్న ఫలం మాత్రం దక్కలేదు.  

బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి. బీఎంసీలోని మొత్తం 227 వార్డులకు గాను 226 స్థానాల ఫలితాలు వచ్చాయి. వీటిలో శివసేన 84 స్థానాల్లో జయకేతనం ఎగరవేయగా, బీజేపీ  81 స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంది. అయితే ఈ ఫలితంతో ముంబై డాన్ ఎవరూ అనేది తేలే పరిస్థితి కనిపించడం లేదు.

 

సుదీర్ఘకాలంగా కలసిని ఎన్నికలకు వెళ్లిన శివసేన, బీజేపీ ఇప్పుడు ఒంటరిపోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే అధికారం పంచుకునేందుకు ఈ రెండు పార్టీలు మళ్లీ కలుస్తాయా లేదా అనేది తెలియడం లేదు. ఎందకంటే ఈ రెండు పార్టీలు ఇతర పార్టీలతో కలసే అవకాశం దాదాపు లేదు.  

 

కాగా, ఈ సారి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ పరిచింది. కేవలం 31 స్థానాలు గెలుచుకొని తన ఉనికిని కాపాడుకుంది. ఎన్సీపీ కూడా నిరాశే ఎదురైంది. కేవలం 9 స్థానాలతో సరిపెట్టుకుంది. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) 9 స్థానాల్లో గెలిచి పరువు నిలబెట్టుకుంది.

 

ఫలితాలు వెలువడక ముందు బీజేపీ దే గెలుపు అని రాజకీయ నాయకులు విశ్లేషించారు. ముఖ్యంగా శివసేన తన చిరకాల నేస్తం బీజేపీని వదలి ఒంటిరిపోరుకు సై అన్న నేపథ్యంలో ఈ ప్రాంతీయ పార్టీకి చావు దెబ్బతప్పదని భావించారు. 

 

కానీ, ఫలితం మాత్రం ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. శివసేన తన ప్రాంతీయ వాదంతో మరోసారి సత్తా చాటింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios