Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల ఒత్తిడి: షైన్ ఆసుపత్రిపై భగ్గుమంటున్న చిన్నారి కుటుంబసభ్యులు

హైద్రాబాద్ ఎల్బీనగర్ లో షైన్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంతో మృతి చెందిన చిన్నారి మృతదేహానికి ఇంతవరకు పోస్టుమార్టం పూర్తి కాలేదు. అగ్ని ప్రమాదం సమయంలో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. షైన్ ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చిన్నారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

shine hospital:Not yet complete postmorterm to child body
Author
Hyderabad, First Published Oct 21, 2019, 4:36 PM IST


హైదరాబాద్: షైన్ ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని మృతి చెందిన చిన్నారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు తెల్లవారుజామున ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో  ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాలుగు మాసాల చిన్నారి మృతి చెందాడు.

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చిన్నారి కోసం  కుటుంబసభ్యులు ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని చిన్న పిల్లల ఆసుపత్రిలో వెదికారు. కానీ, ఎక్కడ కూడ ఆ చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు.

Related article

చిన్నారి మృతి ఎఫెక్ట్: షైన్ ఆసుపత్రి సీజ్

దీంతో సోమవారం నాడు ఉదయం  చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను నిలదీశారు. తమ కొడుకు ఆచూకీ ఎక్కడ అని ప్రశ్నించారు. అయితే  ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చురీలో చిన్నారి మృతదేహం ఉందని  పోలీసులు చెప్పడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు.

ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని పోలీసులే ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. దీంతోనే ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో చిన్నారి మృతదేహానికిపోస్టు మార్టం కూడ నిర్వహించలేదని  వారు ఆరోపణలు చేస్తున్నారు.

Related article

షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం: చిన్నారి మృతి, మరో ఆరుగురి పరిస్థితి విషమం

ఉస్మానియా ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి పోస్టు మార్టం కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. చిన్నారి మృతి చెందినందుకు గాను పరిహారం చెల్లించాలంటే ఆసుపత్రికి  అనుకూలంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్టుగా చిన్నారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

సోమవారం తెల్లవారుజామున రెండున్నర  గంటలకు ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకొంది.దీంతో ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లు కూడ పెద్ద శబ్దంతో పేలిపోయాయి. ఈ శబ్దం తో ఈ ఆసుపత్రిలో చిన్నారుల తల్లిదండ్రులు లేచి ఐసీయూలోని పిల్లల  వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఆసుపత్రి సిబ్బంది మాత్రం వారిని అక్కడికి వెళ్లేందుకు అనుమతించలేదని బాధితులు  చెబుున్నారు. 

అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తర్వాతే ఐసీయూలోని చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే దట్టమైన పొగ కారణంగా నాలుగు నెలల చిన్నారి మృతి చెందగా, మరో ఆరుగురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

అస్వస్థతకు గురైన చిన్నారులను ఎల్బీనగర్ కు సమీపంలోని  పలు చిన్న పిల్లల ఆసుపత్రుల్లో చేర్పించారు. ప్రస్తుతం ఆ చిన్నారులు కోలుకొంటున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే చిన్నారి మృత్యువాత పడినట్టుగా బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. 

షైన్ ఆసుపత్రి స్థానికంగా ఉన్న ఓ రాజకీయ ప్రముఖుడికి చెందిందిగా తెలుస్తోంది. ఫైర్ సేఫ్టీ మేజర్స్ ను ఇంతవరకు తీసుకోలేదని అగ్నిమాపక సిబ్బంది తేల్చారు. ఫైర్ లైసెన్స్ కూడ రెనివల్ చేసుకోలేదని ఈ సందర్భంగా గుర్తించారు. దీంతో ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని సీజ్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios