Asianet News TeluguAsianet News Telugu

Shilpa Chowdary: రోజుకో మలుపు.. రూ. 7 కోట్లు తిరిగి ఇచ్చేస్తా..విచారణలో ఆ ముగ్గురి పేర్లు చెప్పిన శిల్ప..!

పలువురు సినీ, రాజకీయ ప్రముఖలకు నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి (Shilpa Chowdary) కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటితో శిల్పా చౌదరి పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను నేడు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

Shilpa Chowdary Police Custody ends cops fail to extract any info
Author
Hyderabad, First Published Dec 13, 2021, 11:32 AM IST

పలువురు సినీ, రాజకీయ ప్రముఖలకు నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి (Shilpa Chowdary) కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్నటితో శిల్పా చౌదరి పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను నేడు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ విచారణ సందర్భంగా నార్సింగి పోలీసులు శిల్పా చౌదరి నుంచి కీలక వివరాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు ఆహ్వానించిన శిల్ప... వారికి అధిక వడ్డీ ఆశ చూపి రూ. కోట్లు కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ఆమెపై ముగ్గురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తాజాగా విచారణలో శిల్ప కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. తాను మోసం చేసినట్టుగా ఫిర్యాదు చేసిన ముగ్గురికి రూ. 7 కోట్లు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా శిల్ప పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం. తాను డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఇస్తేనే బాధితులకు డబ్బులు ఇస్తానని చెప్పింది. ఇక, శిల్ప మూడేళ్లపాటు అమెరికాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు శిల్ప రెండు బ్యాంక్ ఖాతాల్లో రూ. 48 వేలు, ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ ఖాతాలో రూ. 14 వేలు గుర్తించినట్టుగా తెలుస్తోంది.

ఆ ముగ్గురు పేర్లు చెప్పిన శిల్ప..
ఎన్నారై ప్రతాప్‌రెడ్డి, మల్లారెడ్డి, రాధికా రెడ్డి పేర్లను శిల్ప ప్రస్తావించినట్టుగా సమాచారం. ముగ్గురు వ్యక్తులు తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని శిల్ప పోలీసులకు తెలిపింది. అయితే అందకు సంబంధించి పోలీసులుకు శిల్ప ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. ఈ క్రమంలోనే పోలీసులు శిల్ప చెప్పిన ముగ్గురిని విచారించారు. ఎన్నారై ప్రతాప్‌రెడ్డి‌ని ఫోన్‌లో సంప్రదించారు. అయితే వారు మాత్రం శిల్ప‌ తమకే డబ్బులు ఇవ్వాల్సి ఉందని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఆధారాలను, వాట్సాప్ చాట్‌లను వారు పోలీసులకు అందజేశారు. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే తప్పుడు సమాచారం చెప్పి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Also Read: ముగిసిన శిల్పాచౌదరి కస్టడీ : మూడు రోజులూ నోరు విప్పక, పోలీసులకు ముప్పుతిప్పలు

శిల్ప మోసం వెలుగులోకి వచ్చింది ఇలా..  
సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు ఆహ్వానించిన శిల్ప... అధిక వడ్డీ ఆశ చూపి పలువురు మహిళల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.  శిల్పాచౌదరికి రూ. 1.05 కోట్లు ఇస్తే తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా బౌన్సర్లతో బెదిరిస్తోందంటూ పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి నార్సింగి పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఆ తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ కుమార్తె ప్రియదర్శిని.. శిల్పకు రూ.2.9 కోట్లు ఇచ్చి మోసపోయానని ఫిర్యాదు చేశారు. తర్వాత మరో మహిళ వ్యాపారవేత్త శిల్ప రూ. 3.1 కోట్లు తిరిగి చెల్లించడం లేదని పోలీసులను ఆశ్రయించారు. 

దీంతో శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే చాలా మంది చట్టపరమైన వ్యవహారాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో ఫిర్యాదుకు రావడానికి వెనకడుగు వేస్తున్నారని పోలీసులు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios