Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన శిల్పాచౌదరి కస్టడీ : మూడు రోజులూ నోరు విప్పక, పోలీసులకు ముప్పుతిప్పలు

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులు, సంపన్నులను కోట్లాది రూపాయల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి (shilpa chowdary) పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణ సందర్భంగా ఆమె ఏమాత్రం నోరు విప్పలేదని సమాచారం

shilpa chowdary 3 days police custody complete
Author
Hyderabad, First Published Dec 12, 2021, 7:33 PM IST

కిట్టీ పార్టీల పేరుతో సినీ, రాజకీయ ప్రముఖులు, సంపన్నులను కోట్లాది రూపాయల మేర మోసం చేసిన కిలాడీ లేడీ శిల్పా చౌదరి (shilpa chowdary) పోలీస్ కస్టడీ ముగిసింది. విచారణ సందర్భంగా ఆమె ఏమాత్రం నోరు విప్పలేదని సమాచారం. అంతేకాకుండా పోలీసులపైనే శిల్ప దురుసుగా ప్రవర్తించినట్లుగా  తెలుస్తోంది. 3 కేసుల్లో శిల్పను ఇప్పటికే రెండుసార్లు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.

ఆమె బ్యాంకు ఖాతాల్లో నిల్ బ్యాలెన్స్ చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. 3 కేసులకు సంబంధించి రూ.7.9 కోట్ల మేర శిల్ప మోసం చేసింది. హీరో భార్యతో పాటు ఇద్దరు వ్యాపారవేత్తల భార్యలకు కూడా ఆమె కుచ్చుటోపీ పెట్టింది. సంపన్నుల భార్యల్నే శిల్పా చౌదరి టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కిట్టి పార్టీల పేరుతో ప్రముఖులకు ఆమె ఎర వేసి పరిచయాలు పెంచుకుంది. అయితే తాను వసూలు చేసిన డబ్బుల్ని త్వరలో ఇస్తానని శిల్పా పోలీసులతో చెబుతోంది. 

Also Read:shilpa chowdary: శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడు రోజుల పాటు విచారణ

రేపు ఉదయం 11 గంటలకు ఆమెను  ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు. కస్టడీలో శిల్ప సహకరించక ముప్పతిప్పలు పెడుతున్న శిల్పాను మరోసారి కస్టడీ అడిగేందుకు పోలీసులు సిధ్ధమవుతున్నారు.  రేపు ఉదయం లోపల ఆమె వద్దనుంచి వీలైనంతవరకు సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా మొదట రెండు బ్యాంకు అకౌంట్లను  పోలీసులు ఫ్రీజ్ చేశారు.  ఇప్పడు మరో 3 అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. మొత్తం 5 బ్యాంక్ అకౌంట్ల‌తో పాటు ఒక లాకర్‌ను కూడా పోలీసులు ఫ్రీజ్ చేశారు.  ఇప్పటికే శిల్పాచౌదరి చేసిన అప్పులకు సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు.. బాధితుల స్టేట్మెంట్స్ ఆధారం చేసుకుని శిల్పా ముందు పెట్టడంతో తాను నిర్దోషినంటూ పోలీసులతో వాదనకు దిగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా.. గతంలో రెండు రోజుల విచారణ సందర్భంగా శిల్పా చౌదరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తులో ముందుకు వెళ్తున్నారు పోలీసులు.  శిల్ప కేసులో తమను మోసం చేసిందని ఇప్పటికే పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బ్లాక్ మనీ కావడంతో ఫిర్యాదు చేయడానికి పలువురు ప్రముఖులు వెనుకాడుతున్నట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios