తెలంగాణ షీ టీమ్స్ కేసిఆర్ ఇంటిచుట్టే తిరుగుతున్నాయి

First Published 30, Dec 2017, 5:46 PM IST
she teams are moving around cm kcr bjp mahila moracha charges
Highlights
  • తుమ్మల నాగేశ్వరరావు మహిళ నా?
  • అమెరికా బొమ్మ ఇవాంకకు అంత సెక్యూరిటీ ఎందుకు
  • మహిళా కమిష్ ను వెంటనే నియమించాలి

తెలంగాణ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న షీ టీమ్స్ ప్రస్తుతం సిఎం కేసిఆర్ ఇంటిచుట్టూ చక్కర్లు కొడుతున్నాయని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఆరోపించారు. బంగారు తెలంగాణలో మహిళకు రక్షణ లేదన్నారు. షీ టీమ్స్ కేసీఆర్ ఇంటి చుట్టే తిరుగుతున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళలను అగౌర పరుస్తుందన్నారు.

మహిళా సంక్షేమ శాఖ కు మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళా సంక్షేమ శాఖ చూస్తున్న తుమ్మల నాగేశ్వరరావు మహిళనా అని నిలదీశారు. కేసిఆర్ పాలనలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు.

మహిళా కమీషన్ ను వెంటనే వేయాలన్నారు. అమెరికా బొమ్మ ఇవాంక కు అంత సెక్యూరిటీ పెట్టారు కానీ.. తెలంగాణ ఆడపడుచుల మీద ఎందుకు నీకు చిన్న చూపు అని నిలదీశారు. తెలంగాణ ఆడ బిడ్డలకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టకపోతే బిజెపి మహిళామోర్చా పోరుబాట పడుతుందన్నారు.

loader