YS Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, దివంగత మాజీ సీఎం వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలకు అరుదైన గౌరవం దక్కింది. వైఎస్ షర్మిల పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్‌లో చేరింది. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
YS Sharmila Padayatra: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె , ఏపీ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరిట పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాను తెలంగాణ కోడలిని అంటూ ఇక్కడి రాజకీయాల్లో చక్రం తిప్పాలని యోచించింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకవస్తాననీ, రైతురాజ్య స్థాపనే తన దేయంగా ముందుకు సాగుతుంది. తరుచు అధిక బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించింది. ఈ క్రమంలో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది.
తన తండ్రి వైఎస్ఆర్ చేసిన విధంగా పాదయాత్రను చేపట్టింది. వర్గాల బేధం, ప్రాంతాల బేధం, పార్టీల బేధం చూపించకుండా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలా పాదయాత్రను ప్రారంభించింది. రాష్ట్రంలోని నలు ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. తన పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకంజ వేయకుండా ముందుకు సాగించారు. సమస్య ఎక్కడ ఉంటే.. అక్కడ అడుగుపెట్టింది. ఆ సమస్యలను వెలుగులోకి తెచ్చి.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. కొన్ని సార్లు వరకు వెళ్లి తన పాదయాత్రకు అనుమతి తెచ్చుకుని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలా పాదయాత్ర కొనసాగించారు. ఇలా ఓ మహిళ సుదీర్ఘ పాదయాత్ర చేయడం చాలా అరుదైన గౌవరం దక్కింది.
అత్యధిక దూరం పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్‌లో (Indian Book of Records) చేరింది. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసింది. ఈ క్రమంలో అధిక దూరం పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డు సృష్టించారు. ఇందుకు గాను వైఎస్సార్టీపీ అధినేత్రి పేరు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరింది. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైఎస్ షర్మిలకు అభినందనలు తెలుపుతూ అవార్డును ప్రదానం చేశారు.
ప్రజా ప్రస్థానం పాదయాత్ర
2021 అక్టోబర్ 20న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరిట పాదయాత్రను ప్రారంభించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన ప్రాంతం చేవెళ్ల నుంచే షర్మిల కూడా పాదయాత్ర మొదలు పెట్టారు. దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన ఈ పాదయాత్రలో ఆమె అనేక అడ్డంకులను ఎదుర్కొంది. అయినా.. ఆవరోధనలు అధిగమిస్తూ.. షర్మిల తన పాదయాత్రలో ముందుకు సాగారు. ఈ పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో నర్సంపేటలో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో కొన్ని రోజులపాటు పాదయాత్ర ఆగిపోగింది. అనంతరం కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. ఏపీలో కూడా షర్మిల పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే.
