మంచిర్యాల: మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్‌  సీఎం కేసీఆర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని శరత్  దాయాది కుటుంబానికి చెందిన జ్యోతి ఆరోపించారు. శరత్ తరహాలోనే ఆమె కూడ ఓ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు.

మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండంల నందులపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు భూ సమస్యపై సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది.

దీంతో కేసీఆర్ శరత్‌తో బుధవారం నాడు ఫోన్లో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హెలికెరిని నందులపల్లి గ్రామానికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించి శరత్ కుటుంబానికి బుధవారం నాడు పట్టాను కూడ అందించింది.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ, శరత్  మాత్రం కేసీఆర్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని శరత్ దాయాది కుటుంబానికి చెందిన జ్యోతి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఆడియో పోస్ట్ చేసింది. నందులపల్లి గ్రామ శివారులోని 2.25 ఎకరాల భూమిలో శరత్ తండ్రి శంకరయ్య వాటా కోరాడని జ్యోతి చెప్పారు.

అయితే అదే గ్రామంలోని 271 సర్వే నెంబర్‌లోని 7.01 ఎకరాల భూమిలో కూడ తమ  కుటుంబానికి వాటా కావాలని  తన తండ్రి మల్లయ్య  కోరాడని  ఆమె చెప్పారు.  కానీ, ఈ ఏడు ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి అని ఆమె వివరించారు. రెండు ఎకరాల భూమిలో శరత్ తండ్రి శంకరయ్యకు వాటా కావాలంటే 271 సర్వే నెంబర్‌లోని 7 ఎకరాల్లో కూడ తాము వాటా కావాలని కోరినట్టు తెలిపారు

అయితే ఈ ఏడు ఎకరాల భూమిని తమకు తెలియకుండానే శరత్ తండ్రి శంకరయ్య రిజిస్ట్రేషన్ చేయించుకొన్నాడని ఆమె ఆరోపించారు. తమ కుటుంబం హైద్రాబాద్‌లో ఉంటుందని శరత్ తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు.  తాము గ్రామంలోనే ఉంటున్నామన్నారు. శరత్‌తో మాట్లాడిన సమయంలో సీఎం కేసీఆర్ తాము శరత్ కుటుంబంతో బంధుత్వం ఉందా లేదా ఎందుకు తేల్చుకోలేదని ఆమె ప్రశ్నించారు.

రైతు బంధు పథకం కింద డబ్బులు తీసుకొన్నారని కూడ  తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని రుజువు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.తమను విచారించకుండానే ఎలా పట్టాలు ఇస్తారని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లే వరకు ఈ ఆడియోను షేర్ చేయాలని ఆమె కోరారు.

 

                  "

సంబంధిత వార్తలు

సీఎం హామీతో శరత్ సమస్య పరిష్కారం...భూమి పట్టా అందించిన కలెక్టర్
శరత్‌కు ఫోన్ చేసిన కేసీఆర్: కలెక్టర్ భారతికి ఆదేశాలు (ఆడియో)