Hyderabad: లోదుస్తుల్లో బంగారం దాచి అక్ర‌మ ర‌వాణా చేస్తున్న ఒక వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టు లో  కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.47 లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు. 

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇటీవ‌లి కాలంలో అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న బంగారం ప‌ట్టుబ‌డుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి అక్ర‌మంగా బంగారం త‌ర‌లిస్తున్న ఒక వ్య‌క్తిని క‌స్ట‌మ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.47 లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. బంగారాన్ని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న కేసులు అధికంగా వెలుగుచూస్తున్న త‌రుణంలో కస్టమ్స్‌, డీఆర్ఐ అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఈ త‌ర‌హా చ‌ర్య‌లు ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయ్ ఈకే 528 విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 823 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బంగారం అక్ర‌మ రవాణా గురించి త‌మ‌కు ముందుస్తు స‌మ‌చారం అందింద‌ని అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే త‌నిఖీలు చేస్తుండ‌గా, ఒక ప్రయాణికుని వ‌ద్ద అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన లోదుస్తుల్లో బంగారాన్ని దాచి తీసుకువ‌స్తున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ.47 లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌నీ, అత‌ను దుబాయ్ నుంచి వ‌స్తున్నాడ‌ని తెలిపారు. హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన‌వాడ‌ని పేర్కొన్నారు.