Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ను ఇరుకునపెడుతున్న షబ్బీర్ అలీ ప్రశ్న

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు ఏం చేశారు. ఎక్కడైనా అంబేద్కర్ కు నివాళులు అర్పించారా...?

Shabbir ali poses embarrassing question to cm kcr

శాసన మండలి విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ... మీడియా కూడా కనిపెట్టలేకపోయిన ఓ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ను ఇరుకనపెట్టారు.

నిన్న దేశవ్యాప్తంగా అంబేద్కర్ వర్థంతి ఘనంగా జరిగింది. అన్ని రాష్ట్రాలు అధికారికంగా ఈ కార్యక్రమాలను నిర్వహించి రాజ్యాంగపితకు ఘనంగా నివాళులు అర్పించాయి. వివిధ రాష్ట్రాల సీఎంలు అధికార హోదాలో అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ ప్రసంగాలిచ్చారు.

 

మరి, తెలంగాణలో ఏమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ వర్థంతి రోజు ఏం చేశారు. ఎక్కడైనా అంబేద్కర్ కు నివాళులు అర్పించారా...

 

అంబేద్కర్ దయవల్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని పదే పదే చెప్పే సీఎం కేసీఆర్ మరి, అంబేద్కర్ వర్థింతి రోజు ఎందుకు బయటకు రాలేదు. అంత బీజీగా ఎందుకున్నారు...

రాష్ట్రంలో ఏ మీడియా కూడా ఈ ప్రశ్నను లేవనెత్తలేదు. కానీ, షబ్బీర్ అలీ మాత్రం ఈ ప్రశ్నను లేవనెత్తి ఇప్పుడు సీఎంను ఇరుకున పడేశారు.

 

‘కేసీఆర్.. నీకు అంబేద్కర్ కు పూల మాల వేసే టైమ్ కూడా లేదా..? దళిత సీఎం అంటూ అధికారం చేపట్టి, దళితులకు మూడేకారాల భూమి ఇస్తామన్న వాగ్దానాన్ని గాలికోదిలేశావ్  అలాంటి నీకు దళితుల గురించి మాట్లాడే హక్కు లేదు’ అని ఆయన విరుచుకపడ్డారు.

 

నిజమే కదూ... మీడియా మొత్తం కనిపెట్టలేని విషయం షబ్బీర్ కనిపెట్టారు. మరి ఈ విషయం మీద సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios