పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధుకు సన్నిహితంగా ఉన్న పోలీసుల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు మేరకు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మెన్ పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న  మంథని నియోజకవర్గంలో పలువురు పోలీసులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.   పుట్ట మధుకు సన్నిహితంగా ఉన్న పోలీస్ అధికారుల జాబితాను సేకరించి  బదిలీ చేశారు.  

also read:పుట్ట మధు భార్య శైలజకి నోటీసులు: విచారణకు హాజరుకావాలన్న పోలీసులు

మంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్‎తో పాటు.. ముత్తారం ఎస్ఐ నరసింహారావు, రామగిరి ఎస్‌ఐ మహేందర్ బదిలీ చేస్తున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే పుట్ట మధును పోలీసులు వామన్ రావు హత్య కేసులో విచారిస్తున్నారు. ఆదివారం నాడు మధు భార్య శైలజకి కూడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.