పుట్ట మధు భార్య శైలజకి నోటీసులు: విచారణకు హాజరుకావాలన్న పోలీసులు
మంథని మున్సిఫల్ ఛైర్‌పర్సన్ , జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధు భార్య శైలజకు పోలీసులు ఆదివారం నాడు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు.
పెద్దపల్లి: మంథని మున్సిఫల్ ఛైర్‌పర్సన్ , జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధు భార్య శైలజకు పోలీసులు ఆదివారం నాడు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. 41 సీఆర్‌పీసీ కింద పుట్ట శైలజకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణ రావాలని కోరారు. ఇప్పటికే పోలీసుల అదుపులో పుట్ట మధు ఉన్నారు. రెండో రోజూ పుట్టమధును పోలీసులు విచారిస్తున్నారు.
also read:పోలీసు వేట: కేసీఆర్ తో భేటీకి పుట్ట మధు భార్య విఫలయత్నం
లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసు విషయమై వామన్ రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పుట్టా మధును విచారిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలోని ఓ ఫామ్‌హౌజ్‌లో తలదాచుకొన్న పుట్ట మధును శనివారం నాడు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వామన్ రావు దంపతుల హత్య కేసు విషయమై పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. పుట్ట మధు భార్య సీఎం కేసీఆర్ ను కలిసేందుకు శనివారం నాడు ప్రయత్నించారు. సీఎం కలవడం సాధ్యంకాకపోవడంతో ఆమె జిల్లా ఇంచార్జీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిశారు.