నాగర్‌కర్నూల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో  ఏడేళ్ల చిన్నారిని తండ్రి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకొంది.నాగర్ కర్నూల్ మండలం మంతటి  గ్రామానికి చెందిన  ఎర్రమోని శివశంకర్ , స్వప్న దంపతులకు   ఇద్దరు పిల్లలు. మల్లిఖార్జున్ కు ఏడేళ్లు, ప్రణయ్ కు ఐదేళ్లు.  శివశంకర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.కుటుంబ కలహాలతో శివశంకర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శివశంకర్ తాను ఉంటున్న ఇంటి పక్కనే  అతని తల్లిదండ్రులు మరో ఇంట్లో ఉంటున్నారు.

భార్య చనిపోయిన తర్వాత  ఇద్దరు పిల్లలు తన వద్దే  ఉంటున్నారు. శివశంకర్ కు  మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది.  మహిళతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఈ పిల్లలను అడ్డు తొలగించుకోవాలని అతను భావించాడు.  ఈ క్రమంలోనే గురువారం నాడు తన గదిలో నిద్రపోతున్న ఇద్దరు పిల్లల మణికట్టును కత్తితో కోశాడు. చెరువు వద్దకు వెళ్లి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు తాను ఆత్మహత్య చేసుకొంటున్నానని  కూడ బెదిరించాడు.

తమ ఇంటి పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి చూస్తే   మల్లిఖార్జున్ అప్పటికే మరణించాడు.  ప్రణయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రణయ్ ను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెరువు వద్ద ఉన్న శివశంకర్ ను గ్రామస్థులు పట్టుకొని కొట్టారు.  ఈ ఘటనపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.