రంగారెడ్డి జిల్లాలో విందు:  ఏడుగురికి కరోనా, ఊరంతా కంటైన్మెంట్

యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కగుట్టతండాలో ఓ విందుకు హాజరైన ఏడుగురికి కరోనా సోకింది.

రంగారెడ్డి జిల్లా  జిల్లా నక్కగుట్టతండాలో ఇటీవల ఓ విందు జరిగింది. ఈ విందులో పాల్గొన్న ఏడుగురికి కరోనా సోకింది. తండాలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయడంతో 40 కుటుంబాలు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి.

ఈ విందుకు ఎల్బీనగర్ కు చెంది వ్యక్తి తండాలోని ఓ ఇంట్లో మూడు రోజుల పాటు ఉన్నాడు. అప్పుడే  అతనికి జ్వరం వచ్చింది. అయితే అతను హైద్రాబాద్ కు వచ్చి యశోదా ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకొన్నాడు. దీంతో కరోనా పాజిటివ్ గా తేలింది. 

అతను తండాలో ఎవరింట్లో నివాసం ఉన్నాడో ఆ ఇంట్లోని మహిళకు కూడ కరోనా సోకింది. అంతేకాదు ఆమె కొడుకుకు కూడ  కరోనా సోకినట్టుగా అధికారులు గుర్తించారు. వీరిని హోం క్వారంటైన్ చేశారు.

విందులో వీరితో పాటు పాల్గొన్న మరో ఐదుగురికి కూడ కరోనా సోకింది.  వీరిని అబ్దుల్లాపూర్‌మెట్టు, ఆరుట్ల, ఇబ్రహీంపట్నం, సరూర్ నగర్ ప్రాంతాలకు చెందినవారుగా  గుర్తించారు. ఈ విందుకు హాజరైన వారిని గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.