హైదరాబాద్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఉమేష్‌ ఖాతిక్‌ (Umesh Kathik) కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అహ్మదాబాద్ పోలీసులు (Ahmedabad police) కస్టడీ నుంచి ఉమేష్ పరారయ్యాడు.దీనిపై తెలంగాణ పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఉమేష్‌ ఖాతిక్‌ (Umesh Kathik) కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అహ్మదాబాద్ పోలీసులు (Ahmedabad police) కస్టడీ నుంచి ఉమేష్ పరారయ్యాడు. మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్‌గా (chain snatcher) ఉన్న ఉమేష్‌ను గత నెలలో ఒకేరోజు హైదరాబాద్‌లో 6 చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. దీంతో అతనిపట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే గుజరాత్ పోలీసులు ఉమేష్‌ను అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు.

మరోవైపు ఉమేష్ ఖాతిక్‌ను పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈలోపే అహ్మదాబాద్ పోలీసులు కస్టడీ నుంచి ఉమేష్ పరార్ కావడంపై తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇక, గత నెల 18న ఉమేష్ హైదరాబాద్ చేరుకుని నాంపల్లిలోని మెజెస్టిక్ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నాడు. చైన్ స్నాచింగ్‌లు చేసేందుకు వీలుగా ముందుగా ఆసిఫ్‌నగర్‌లో ఓ బైక్‌ను దొంగిలించాడు. ఆ తర్వాత మారేడ్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌, తుకారాం గేట్‌, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో మహిళల నుంచి చైన్‌లను దొంగిలించాడు. ఇలా హైదరాబాద్‌లోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు మహిళల నుంచి 13.5 తులాల బంగారాన్ని ఉమేష్ ఖాతిక్ దొంగిలించాడు. చివరిగా మేడిపల్లి వద్ద అతడు చివరి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. అనంతరం బైక్‌ని, జాకెట్‌ని ఓ హోటల్‌ ముందు వదిలేసి అహ్మదాబాద్‌కి రైలు ఎక్కాడు.

దీనిని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు.. ఐదుగురు సభ్యులతో కూడిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఉమేష్ ఖాతిక్‌ను పట్టుకునేంందుకు అహ్మదాబాద్‌కు పంపింది. అయితే మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచర్‌గా ఉన్న ఉమేష్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు అనుమతితో కస్టడీలో తీసుకున్నారు.

హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఉమేష్ ఖాతిక్‌ను పీటీ వారెంట్‌పై నగరానికి తీసుకురావడనికి పోలీసులు యత్నిస్తున్నారు. ఈలోపే అహ్మదాబాద్ పోలీసుల కస్టడీ నుంచి ఉమేష్ పరారు కావడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఉమేష్ గుజరాత్‌లో పాటుగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. అతనిపై 100కు పైగా కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది.