Asianet News TeluguAsianet News Telugu

ఫాంహౌజ్ లో పేకాట : ఎమ్మెల్యేలు, ఎంపీలతో వాట్సాప్ చాట్..ఎంటర్టైన్మెంట్ కోసం అమ్మాయిలు... విస్తుపోయే వాస్తవాలు..

gutta suman ఫోన్ కాంటాక్ట్ జాబితాలో..  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది MLAs, MPs ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అతడు పంపిన మెసేజ్ లు, వాట్స్అప్ చాట్ లకు ఎవరు స్పందించకపోవడం గమనార్హం.

Sensational issues come to light in Farm House poker case
Author
Hyderabad, First Published Nov 5, 2021, 10:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ :  పేకాట,  క్యాసినో దందా సూత్రధారి బుధవారం కస్టడీలోకి తీసుకుని నార్సింగి పోలీసులు విచారించగా... ఈ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.  అతడి కాల్ డేటా, వాట్సాప్ గ్రూపులో కీలకమైన సమాచారం లభించింది. 

gutta suman ఫోన్ కాంటాక్ట్ జాబితాలో..  రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది MLAs, MPs ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే అతడు పంపిన మెసేజ్ లు, వాట్స్అప్ చాట్ లకు ఎవరు స్పందించకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలతో సుమన్ నేరుగా మాట్లాడుతున్నాడా?  మధ్యవర్తుల సహకారంతో చర్చలు జరుపుతున్నాడా? అనేది  నిగ్గుతేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.  హోటళ్లు, ఫామ్ హౌస్లు గదులను అద్దెకు తీసుకుని పేకాట, క్యాసినోలను సుమన్ నిర్వహించే వాడని  విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలోనే ఒక యువ hero తండ్రితో ఉన్న పరిచయంతో నార్సింగిలోని farmhouseని ఒకరోజు అడిగి తీసుకున్నట్లు సమాచారం. నిజానికి ఆ ఫార్మ్ హౌస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గార్గ్ దిగా పోలీసులు గుర్తించారు. దాన్ని యువహీరో తండ్రి రెండేళ్లు లీజుకు తీసుకున్నట్లు గుర్తించారు.  

రెండు నెలల క్రితం గచ్చిబౌలి పరిధిలోని సుమధుర కాలనీలో పేకాట స్థావరం పై దాడి చేసిన పోలీసులు  సుమన్ ను అరెస్టు చేశారు. అయితే ఆ ముఠాలో అతడు కేవలం ఆటగాడు మాత్రమే.  

నిర్వాహకులు వేరేవారు.  ఇప్పటివరకు అతనిపై పంజాగుట్ట,  కూకట్పల్లి,  గచ్చిబౌలి,  విజయవాడ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.  విజయవాడలో భూకబ్జా కేసు నమోదు కాగా,  మిగిలిన పోలీస్స్టేషన్లలో  చీటింగ్ కేసులో ఉన్నట్లు తెలిపారు.

క్యాసినో దందాలో  ఆరితేరిన సుమన్…

ప్రతివారం goaకు 200 మందిని తీసుకువెళ్లే వాడని విచారణలో బయట పడింది.  వెళ్లిన వారికి సర్వీస్ చేయడానికి యువతులను కూడా తీసుకెళ్ళేవాడని సమాచారం.  గోవాలో గేమ్స్ ఆడి డబ్బులు గెలుచుకున్న వారి నుంచి 40 శాతం కమీషన్ తీసుకుని 60 శాతం వారికి ఇచ్చే వాడని తెలుస్తుంది.  

నాగ శౌర్య ఫాంహౌజ్ కేసు : పేకాటకు వాట్సాప్ లో ఇన్విటేషన్... గోవా, శ్రీలంకల్లో క్యాసినోలు.. గుత్తా సుమన్ లీలలు..

ఇలా బెంగళూరు చెన్నై, ముంబై ప్రాంతాలనుంచి జూదరులు,  పేకాటరాయుళ్లను  ఆకర్షించే వాడని సమాచారం.  గురువారం ఒక్క రోజు మాత్రమే custody ఉండడంతో ముఖ్యమైన సమాచార సేకరణ పైనే పోలీసులు దృష్టి సారించారు. 

ఇదివరకు గోవా, శ్రీలంకలో క్యాసినోలు నిర్వహించిన సుమన్... తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని అక్కడికి తీసుకు వెళ్లినట్లు సమాచారం.  కొన్నిసార్లు గోవా నగర శివారులో Poker camps ఏర్పాటు చేసి అక్కడ సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది.  

సినీ నటుడు నాగశౌర్య  తండ్రి వద్ద farmhouseను అద్దె ప్రాతిపదికన తీసుకున్న సుమన్...ఎన్నిరోజులు పేకాట శిబిరాలు నిర్వహించారు.. అనేదానిపై నార్సింగ్ పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

ఫామ్ హౌస్ లీజ్ అగ్రిమెంట్ పై ఆరా తీస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్లు, విల్లాలు, కాంట్రాక్టులె ఇప్పిస్తానని సుమన్ పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios