ఇదివరకు గోవా, శ్రీలంకలో క్యాసినోలు నిర్వహించిన సుమన్... తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని అక్కడికి తీసుకు వెళ్లినట్లు సమాచారం.  కొన్నిసార్లు గోవా నగర శివారులో Poker camps ఏర్పాటు చేసి అక్కడ సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ : నగర శివారు మంచిరేవుల ఫామ్ హౌస్ లో పేకాట కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. చాలామంది ప్రముఖులు, పలువురు ప్రజా ప్రతినిధులతో ప్రధాన నిందితుడు Gutta Suman టచ్లో ఉన్నట్లు గుర్తించారు. వాట్సాప్ సందేశాలతో పేకాట శిబిరాలకు వారిని సుమన్ ఆహ్వానించినట్లు తెలిసింది.ఇదివరకు గోవా, శ్రీలంకలో క్యాసినోలు నిర్వహించిన సుమన్... తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని అక్కడికి తీసుకు వెళ్లినట్లు సమాచారం. కొన్నిసార్లు గోవా నగర శివారులో Poker camps ఏర్పాటు చేసి అక్కడ సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలుస్తోంది.

సినీ నటుడు నాగశౌర్య తండ్రి వద్ద farmhouseను అద్దె ప్రాతిపదికన తీసుకున్న సుమన్...ఎన్నిరోజులు పేకాట శిబిరాలు నిర్వహించారు.. అనేదానిపై నార్సింగ్ పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.ఫామ్ హౌస్ లీజ్ అగ్రిమెంట్ పై ఆరా తీస్తున్నారు. మరోవైపు అపార్ట్మెంట్లు, విల్లాలు, కాంట్రాక్టులె ఇప్పిస్తానని సుమన్ పలువురిని మోసం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు.. పేకాట కోసం సుమన్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ లను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల్లో సముమ్ కుమార్ ఛాటింగ్ చేసేవాడు.ఈ వాట్సాప్ గ్రూపుల్లోనే ప్రముఖులకు సుమన్ కుమార్ ఆహ్వానం పంపేవాడు. డిజిటల్ రూపంలో సుమన్ కుమార్ డబ్బులు తీసుకొనేవాడు.

అయితే, ఈ డబ్బులు తీసుకొన్న తర్వాత సుమన్ కుమార్ కాయిన్స్ అందించేవాడు. ఇదిలా ఉంటే పేకాట ఆడే వారి నుండి సుమన్ కుమార్ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసేవాడని సమాచారం. ఒక్కో టేబుల్ కు రూ. 5 లక్షలను వసూలు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

పేకాట ఆడుతూ దొరికితే తనదే పూచీకత్తు అంటూ ఆయన వాట్సాప్ గ్రూపుల్లో ఛాటింగ్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పెద్దలతో తనకు సంబంధం ఉందని వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో కనుగొన్నారు.

నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట: గుత్తా సుమన్‌కుమార్‌ను కస్టడీలోకి తీసుకొన్న నార్సింగి పోలీసులు

గుత్తా సుమన్ hyderabad నగరంలోని స్టార్ హోటళ్లలో పేకాట ఆడిస్తున్నారని పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసుల కీలక విషయాలను ప్రస్తావించారు. మరో వైపు సుమన్ కుమార్ పై ఉన్న కేసుల గురించి కూడా telangana పోలీసులు ఏపీ పోలీసులను సంప్రదించారు. ఏపీ పోలీసులు నార్సింగి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గోవాకు బదులు నగర శివారులో గుత్తా సుమన్ కుమార్ పేకాట శిబిరాలు ఏర్పాటు చేశాడు. ఫాంహౌస్‌ల్లో సకల సౌకర్యాలతో పేకాట శిబిరాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఎప్పట్నుంచి పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. 

మంచిరేవుల Farm House లీజ్ అగ్రిమెంట్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. లీజ్ అగ్రిమెంట్‌ను యువ హీరో తండ్రి పోలీస్‌స్టేషన్‌లో సమర్పించారు. మంచిరేవుల ఫాంహౌస్ లీజ్ అగ్రిమెంట్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. లీజ్ అగ్రిమెంట్‌ను యువ హీరో తండ్రి పోలీస్‌స్టేషన్‌లో సమర్పించారు.