ప్రజలతో మిస్ బిహేవ్ చేస్తున్న పోలీస్ మహిళలపై గౌరవం లేకుండా వ్యవహారం
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఒక పోలీసు అధికారి ఏం చేస్తున్నడో తెలుసా? ఒక మహిళ ఫిర్యాదు రాస్తుండగా ఈ పోలీసు బాస్ కాలు ఎక్కడ పెట్టిండో చూడండి. మహిళ కూర్చున్న బల్ల మీద కాలు పెట్టి పోలీసు పౌరుషం చూపుతున్నట్లుగా ఉంది. అంతేకాకుండా తాను పోలీసు స్టేషన్ లోకి ఎవరైనా ఫిర్యాదు ఇద్దామని వస్తే వారితో ఇలాగే అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా బండ బూతులు తిడతాడని ఈయన మీద టాక్ ఉంది.
వివరాల్లోకి పోతే.. జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ ద్వారకాపూరి కాలనీలో ఇటీవల రాజేష్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజేష్ ని మర్దర్ చేసింది అతని దూరపు బందువు అని తెలిసింది. అయితే రాజేష్ ను హత్య చేసినట్లు భావిస్తున్న వ్యక్తి ఇంటికి మన పోలీసు సార్ పోయిండు. అప్పుడు ఆ నిందితుడి భార్య ఫిర్యాదు తీసుకుంటున్నాడు. ఆమె కంప్లెంట్ రాస్తుండగా ఎదురుగా కూసున్న మన సార్ ఏం చేసిండో కింది వీడియోలో చూడండి.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళలను గౌరవించే పద్ధతి ఇదేనా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పోలీసాయనపై పెద్దసార్లు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అన్నది చూడాలి. ఈ పోలీసు తీరు ఎలా ఉందో కింద ఉన్న వీడియో లో చూడండి.
