రంగారావు అనే వయసు మీద పడిన ఒక వ్యక్తి చిందులేశిండు. మహిళా అధికారిని తిట్లతో అవమానించిండు. విఆర్ఎ ను ఎగిరెగిరి కొట్టిండు. కేసిఆర్ కు చెప్పి ఒక్కరోజులో సస్పెండ్ చేసిప్త అని బెదిరించిండు. జెసిబి తో పనులు జరగకుండా అడ్డు పడ్డడు. ఇదంతా ఎక్కడంటే దూలప్లలి గ్రామంలో జరిగింది. బాధితుల నుంచి అందిన సమాచారం ప్రకారం దూలపల్లిలో చెరువు శిఖం భూముల్లో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఆర్ ఐ రేణుక తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. నిర్మాణాలను కూలగొడుతుంటే ఆ శిఖం భూములు కబ్జా చేసిన రంగారావు అడ్డు తగిలి బెదిరింపులకు దిగిండు. తిట్టిండు.. కొట్టిండు. నేను కేటిఆర్ చుట్టాన్ని అంటూ బెదిరించిండు. రంగారావు రెచ్చిపోయి పుచ్చిపోయిన వీడియో కింద ఉంది చూడండి.