రేపటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. సుమారు 650 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు.

అసెంబ్లీపాటు శాసనమండలి ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అసెంబ్లీ వద్ద విధులు నిర్వహించే 650 మంది పోలీసులకు కరోనా టెస్టులు నిర్వహించారు.

వీరిలో ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారిని ఐసోలేషన్‌కు పంపారు పోలీసు ఉన్నతాధికారులు. వర్షాకాల సమావేశాలు జరిగే అన్ని రోజులూ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.

మరోవైపు రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమవుతుంది. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపైనా చర్చించే ఛాన్స్ వుంది.