కరోనా రోగుల పట్ల హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో దారుణం జరిగింది.

అంబర్‌పేట్‌కు చెందిన సి. నరసింగరావు అనే వ్యక్తికి కరోనా సోకిందని పది రోజుల కిందట యశోదాలో చేర్పించారు. అయితే చికిత్స పేరుతో ఇప్పటి వరకు రూ.8 లక్షల వరకు డబ్బు కట్టించుకున్నారు.

ఈ క్రమంలో నిన్న నరసింగరావు చనిపోయారని ఇంకా రూ.5 లక్షలు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ ఆసుపత్రి యాజమాన్యం వారికి సమాచారం అందించింది. దీంతో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అ

యితే వారికి అనుమానం వచ్చి మరోసారి ఎంక్వైరీ చేయడంతో నరసింగరావు బతికే ఉన్నాడని వీడియో కాల్‌లో చూపించారు యశోదా సిబ్బంది. ఆయన బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రి నిర్వాకంపై ఆశ్చర్యపోయారు.