కరోనాను కట్టడి ఎలాగంటే: భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరలో అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.

secunderabad ujjaini mahankali bonalu swarnalatha bhavishyavani

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ బోనాల జాతరలో అత్యంత కీలకఘట్టమైన రంగం కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది. 

కరోనా కారణంగా బోనాల పండగను ఘనంగా నిర్వహించలేకపోయామని...ఈ కరోనా ఎలా కట్టడి అవుతుందో చెప్పాలంటూ భక్తులు కోరారు. అయితే ఎవరు చేసుకున్నది వారే అనుభవించాలని... మీరు చేసుకున్నదే ఇదంతా అని ఆమె తెలిపారు. కానీ సరైన సమయంలో కరోనాను కట్టడి చేయడానికి తాను వున్నానంటూ స్వర్ణలత రంగం వినిపించారు.  

మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి.. అమ్మవారిని తనలోకి ఆహ్వానించుకుని రాబోయే రోజుల్లో జరగబోయే విషయాలను చెప్పడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఈ ఏడాది కూడా మహంకాళి బోనాలు ముగిసిన తర్వాతి రోజు అంటే ఇవాళ ఆమె రంగం వినిపించారు. కరోనా  కట్టడి చేయడానికి తాను వున్నానంటూ భక్తులకు అభయమిచ్చారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios