సికింద్రాబాద్ లో లారీ బీభత్సం : అదుపుతప్పి ఐదు కార్లను ఢీకొట్టిన లారీ

secunderabad lorry accident
Highlights

గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమం

హైదరాబాద్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్ లోని ప్యాట్నీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి సమయంలో మితిమీరిన వేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి రోడ్డుపై వున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో ఐదు కార్లతో పాటు పలు ద్విచక్ర విహనాలు ద్వంసమయ్యాయి. 

ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో అర్థరాత్రి సమయంలో జరగడంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని, లేదంటే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని పోలీసులు చెబుతున్నారు. 

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు వెల్లడించారు.

 

loader