ఓ కానిస్టేబుల్  ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.  ఇలా ఇటీవల కాలంలో పోలీసు శాఖలో ఆత్మహత్యల పర్వం కొనసాగుతుండటంతో,తాజాగా జరిగిన ఆత్మహత్య  తీవ్ర కలకలం సృష్టిస్తోంది.  
వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా మణికుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. చిలకల గూడ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
అయితే దీనిపై ప్రాథమికంగా విచారించిన పోలీసులు ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత సమగ్రంగా విచారించి ఆత్మహత్యకు గల కారణాలను తెలిజేస్తామని చెప్పారు.