తప్పిన ప్రమాదం: లిఫ్ట్‌లో చిక్కుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆదివారంనాడు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో లిఫ్ట్‌లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చిక్కుకున్నారు. ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫోర్ కు వెళ్లిపోయింది. ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లిపోయింది. లిఫ్ట్ డోర్లు తెరుచుకోలేదు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టి ఎమ్మెల్యేను కాపాడారు. లిఫ్ట్ డోర్లు తెరుచుకోకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టి ఎమ్మెల్యే లాస్య నందితను బయటకు తీసుకు వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోయిన్ పల్లిలోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కంటోన్మెంట్ అసెంబ్లీ టిక్కెట్టును బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆశించాడు. అయితే కంటోన్మెంట్ నుండి లాస్య నందితకే ఆ పార్టీ నాయకత్వం టిక్కెట్టును కేటాయించింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ కూతురు వెన్నెల కాంగ్రెస్ అభ్యర్ధిగా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగారు. గద్దర్ కూతురు వెన్నెలపై లాస్య నందిత విజయం సాధించారు.
also read:ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ ఫోకస్: వై.ఎస్. షర్మిలతో జగన్ కు చెక్ ?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మరణించాడు. సాయన్న మృతితో ఆయన కూతురు లాస్య నందికు భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఏడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ అసెంబ్లీ టిక్కెట్టు కేటాయించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి తొలిసారిగా బరిలోకి దిగిన లాస్య నందిత విజయం సాధించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి ఐదు దఫాలు లాస్య నందిత తండ్రి సాయన్న ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.