కాంగ్రెస్ అధిష్టానానికి చేరిన రేవంత్ సీక్రెట్ లిస్ట్30 మంది పేర్లు అందులో ప్రస్తావించినట్లు ప్రచారంసోషల్ మీడియాకు లీకైన రేవంత్ రహస్య జాబితా

కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి కోర్కెల చిట్టా చేరింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంకేతాలిచ్చిన తరుణంలో రాహుల్ తో భేటీ అయ్యారు రేవంత్. ఈ సందర్భంగా తనతోపాటు యావత్ టిడిపిని కూడా వెంట తెస్తానని ఈ సందర్భంగా రాహుల్ కు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ తనతో సహా వచ్చే నేతలకు కచ్చితంగా రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆ జాబితా ఇదే అంటూ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నది. ఆ లిస్టును మీరూ ఒకసారి చదవండి మరి.

ఢిల్లీలో రెండు రోజులు గ‌డిపిన రేవంత్ అక్క‌డ కాంగ్రెస్ ముఖ్యుల‌ను క‌లిశారు. అలాగే, చివ‌రి రోజు రాహుల్‌తోనూ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తాను పార్టీలోకి వ‌స్తే త‌న‌కు కావాల్సిన‌వి అడ‌గ‌డంతో పాటు, త‌న‌తో వ‌చ్చే వాళ్ల‌కి ఏమివ్వాలో కూడా చ‌ర్చించారు. ఇప్ప‌టికే వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం త‌న‌తో పాటు కాంగ్రెస్‌లో చేరేవారిలో దాదాపు ఓ ముప్పైమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల‌ని రాహుల్‌ను రేవంత్ కోరార‌ట‌. వాళ్లంతా చిన్న‌వారేం కాద‌ని ఎంత బ‌ల‌మైన నాయ‌కులో వివ‌రిస్తూ వారికున్న అర్హ‌త‌ల‌ను రాహుల్ ఎదుట ఏక‌ర‌వు పెట్టార‌ట‌. అలాగే, వారికి సంబంధించిన జాబితాను కూడా రాహుల్ గాంధీకి అంద‌జేశార‌ట‌. ఆ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు, గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసి ఓడిపోయిన వారు ఉన్నారు. జాబితాలో ఉన్న వారి పేర్లు ఇవి.

1 రావి శ్రీ‌నివాస్‌(క‌మ్మ‌) కాగ‌జ్‌న‌గ‌ర్ (2014లో పోటీ చేసిన అభ్యర్థి) ఆదిలాబాద్

2 వ‌డ్డేప‌ల్లి సుభాష్ రెడ్డి(రెడ్డి) కామారెడ్డి జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు

3 ఈ పెద్దిరెడ్డి(రెడ్డి) మాజీ మంత్రి, పార్టీ అధికార ప్ర‌తినిధి, హుజూరాబాద్‌, క‌రీంన‌గ‌ర్

4 సీహెచ్ విజ‌య‌ర‌మ‌ణా రావు(వెల‌మ‌), మాజీ ఎమ్మెల్యే, పెద్ద‌ప‌ల్లి జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు

5 డాక్ట‌ర్ కావంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌రావు(మాదిగ‌), క‌రీంన‌గర్ జిల్లా అధ్య‌క్షుడు, 2014లో పోటీ చేసిన అభ్య‌ర్థి

6 మేడిప‌ల్లి స‌త్యం(మాల‌), 2014లో పోటీ చేసిన అభ్య‌ర్థి, చొప్ప‌దండి క‌రీంన‌గ‌ర్ జిల్లా

7 సండ్ర వెంక‌ట వీర‌య్య(మాదిగ‌), ఎమ్మెల్యే స‌త్తుప‌ల్లి, ఖ‌మ్మం

8 కొత్త‌కోట ద‌యాక‌ర్ రెడ్డి(రెడ్డి), మాజీ ఎమ్మెల్యే, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌

9 ఎర్ర చంద్ర‌శేఖ‌ర్‌(ముదిరాజ్‌), మాజీ ఎమ్మెల్యే, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు

10 బోడ జ‌నార్ధ‌న్‌(మాదిగ‌) మాజీ మంత్రి, చెన్నూరు, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు

11 ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి(రెడ్డి), మాజీ ఎమ్మెల్యే, 2014లో గ‌జ్వేల్‌లో పోటీ చేసిన అభ్య‌ర్థి, మెద‌క్ జిల్లా

12 గ‌డిల శ్రీ‌కాంత్ గౌడ్ (గౌడ్‌), జిల్లాప‌రిష‌త్ ఫ్లోర్ లీడ‌ర్‌, ప‌టాన్ చెరు, మెద‌క్ జిల్లా

13 ప‌టేల్ ర‌మేశ్ రెడ్డి(రెడ్డి), 2014లో పోటీ చేసిన అభ్య‌ర్థి, సూర్యాపేట జిల్లా అధ్య‌క్షుడు

14 కంచ‌ర్ల భూపాల్ రెడ్డి(రెడ్డి), 2014లో పోటీ చేసిన అభ్య‌ర్థి, న‌ల్గొండ‌, మునుగోడు

15 బెల్యా నాయ‌క్‌(లంబాడ‌), 2014లో పోటీ చేసిన అభ్య‌ర్థి, న‌ల్గొండ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు

16 అరికెల న‌ర్సారెడ్డి(రెడ్డి), మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు

17 దోడొళ్ల రాజారాం యాద‌వ్‌(యాద‌వ్‌), 2014లో పోటీ చేసిన అభ్య‌ర్థి, నిజామాబాద్‌

18 దన‌స‌రి అన‌సూయ‌(సీత‌క్క‌)(కోయ‌) మాజీ ఎంఎల్ఏ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, వ‌రంగ‌ల్‌

19 వేం న‌రేంద‌ర్ రెడ్డి(రెడ్డి), మాజీ ఎమ్మెల్యే, 2014 పోటీ చేసిన అభ్య‌ర్ధి, హ‌న్మ‌కొండ‌, వ‌రంగ‌ల్‌

20 గండ్ర స‌త్య‌నారాయ‌ణ రావు(వెల‌మ‌), భూపాల‌ప‌ల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వ‌రంగ‌ల్‌

21 సీతా దయాకర్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే

22 రాజారాం యాదవ్, టిడిపి యువ నేత, నిజామాబాద్ జిల్లా

వీరితోపాటు మరికొందరి పేర్లు ఉన్నట్లు రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతున్నది. అయితే వీరిలో కొందరు పార్టీ మారతారా? లేదా అన్నది కూడా అనుమానంగా ఉన్నది. చివరి నిమిషంలో కాంగ్రెస్ లోకి వెళ్లకుండా టిడిపిలోనే ఉండేవారు కూడా ఈ జాబితాలో ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. మొత్తానికి ఈ జాబితా మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.