తెలుగు ముఖ్యమంత్రుల కొడుకులెవరూ సిఎం కాలేదెందుకు? సెక్రటేరియట్ వాస్తు సిఎం కొడుకులకు అనుకూలంగా లేదా? మధు యాష్కి చెబుతున్న కెసిఆర్ వాస్తు సీక్రెట్
తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన భవనాల వాస్తు దోషాలను ఎందుకంత నిశితంగా చూస్తున్నారు? వాస్తు దోష రహిత భవనాల పేరుతో వందల కోట్లు ఖర్చు చేసేందుకు ఏ మాత్రం సంశయించడం లేదెందుకు?
ఉన్న వాస్తు ప్రకారమే ఆయన సిఎం అయ్యారు. రెండున్నరేళ్లు పూర్తి చేశారు. మరొక రెండున్నరేళ్లు ఎలాగూ పూర్తయవుతాయి. ఇంకా వాస్తు దోషాలు వెదకడం దేనికనే ది ప్రశ్న.
దీనికి సమాధానం కాంగ్రెస్ మాజీ నిజాం బాద్ లోక్ సభ సభ్యుడు మధుయాష్కి గౌడ్ దగ్గిర ఉంది.
ఇపుడున్న భవనాల వాస్తు తండ్రులకే అనుకూలంగా ఉందని కెసిఆర్ గమనించారట. అందుకే నీలం సంజీవరెడ్డి మొదలుకుని రాజశేఖర్ రెడ్డి దాకా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కొడుకులెవరూ ముఖ్యమంత్రి కాలేదు.ఒక రిద్దరికి మినహా అందరికి యోగ్యులైన కొడుకులున్నారు. వాళ్లలో చాలా మంది అసెంబ్లీ గడప దొక్కలేకపోయారు. తొక్కిన వాళ్లకి తండ్రి వారసత్వం దొరకలేదు. ఇలా ముఖ్యమంత్రులెంత గొప్పవాళ్లయినా వాళ్ల కొడుకులు ముఖ్యమంత్రులు కాలేకపోయారు.
దీనికి కారణం ముఖ్యమంత్రుల కొడుకులకు హైదరాబాద్ సెక్రటేరియట్, సిఎం క్యాంప్ ఆఫీస్ వాస్తు సరిగ్గా లేక పోవడమే నని కెసిఆర్ కొనుగొన్నడాని యాస్కి చెబుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ దాదాపు 150 మంది శాసన సభ్యలు మద్దతు ఉన్న జగన్ కూడా తండ్రి అనంతరం ముఖ్యమంత్రి కాలేకపోవడం, సెక్రెటేరియట్ , క్యాంప్ఆపీస్ తదితర పాలనాభవనాల వాస్తు కొడుకులకు అనుకూలంగా లేకపోవడమనని భావించి వీటన్నింటి కూల్చి కుమారుడు కెటిఆర్ కు అనుకూలమయిన వాస్తు ప్రకారం ఆయన పునర్నిర్మించాలనుకుంటున్నారని యాస్కి వాదన.
కొడుకు ముఖ్యమంత్రి కావాలనే, ప్రజాధనం వందల కోట్లు ఖర్చు చేసి వాస్తునే సరిచేసే ప్రయత్నం జరుగుతూ ఉందని ఆయన ఆరోపించారు. కొడుకు కోసం వాస్తు పేరు చెప్పి సెక్రటేరియిట్ కూలగొట్టాలనుకోవడానకి ఒప్పుకునేది లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కావడమటుంచి జీహెచ్ ఎంసీలో రు. 300 కోట్ల పెద్ద కుంభకోణం జరిగిందని దానికి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేస్తే ప్రజలు హర్షిస్తారని యాష్కి అన్నారు.ఈ కుంభకోణం మీద కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
