Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు: 40 ప్రాంతాల్లో తనిఖీలు


 హైద్రాబాద్ లో  రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.  నిన్న టి నుండి హైద్రాబాద్ లోని చిట్ ఫండ్స్ సంస్థల్లో  ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 Second day Income Tax Raids Continue in Several chit funds in Hyderabad lns
Author
First Published Oct 6, 2023, 10:37 AM IST | Last Updated Oct 6, 2023, 10:37 AM IST

హైదరాబాద్: నగరంలోని 40 చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్నటి నుండి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని ఓ చిట్ ఫండ్స్ పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. చిట్ ఫండ్స్ సంస్థ ఎండీ పూజ, ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్లలో,కార్యాలయాల్లో  ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
శంషాబాద్ లోని రఘువీర్ ఇల్లు, కూకట్‌పల్లి ఇందు ఫార్చ్యూన్ లో అధికారుల ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సోదరుడి ఇంటితో పాటు పలు కంపెనీలు, వ్యక్తుల ఇళ్లలో  నిన్నటి నుండి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిన్నటి నుండి వంద మంది ఐటీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నారు.  రెండో రోజు కూడ  ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios