Asianet News TeluguAsianet News Telugu

ప్రమోషన్లలో వివక్ష జరిగింది: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్లకు ప్రొఫెసర్ల వినతి

ఉస్మానియా, గాంధీ,నిలోఫర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని వివరించారు. ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ పాటించలేదంటూ వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వాళ్లు ఉన్నా వివక్ష పాటిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
sc/st professors met commission chairman errolla srinivas
Author
Hyderabad, First Published Oct 2, 2019, 5:12 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన వైద్యుల ప్రమోషన్ల భర్తీపై ఎస్సీఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్ల విధానాన్ని పాటించలేదని ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ ఆస్పత్రులకు చెందిన ప్రొఫెసర్లు తెలంగాణ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కలిశారు. ప్రభుత్వ దవాకానాల్లో తమకు జరిగిన అన్యాయంపై మెురపెట్టుకున్నారు. 

ఉస్మానియా, గాంధీ,నిలోఫర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇటీవల జరిగిన ప్రమోషన్లలో అన్యాయం జరిగిందని వివరించారు. ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ పాటించలేదంటూ వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వాళ్లు ఉన్నా వివక్ష పాటిస్తున్నారంటూ ఆరోపించారు. 

ప్రమోషన్స్ లలో న్యాయం చేయాలని చైర్మన్ ఎర్రోళ్ల  శ్రీనివాస్ ను కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తానని ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు.  

sc/st professors met commission chairman errolla srinivas

Follow Us:
Download App:
  • android
  • ios