Asianet News TeluguAsianet News Telugu

నాన్నా... నా ఇష్ట ప్రకారమే పెళ్ళి చేసుకొన్నా అతడితోనే ఉంటా: సౌదీ యువతి

కారు డ్రైవర్ ను పెళ్ళి చేసుకొన్న సౌదీ యువతి

Saudi Girl Leaves Her Family, Comes To   India Through Nepal To Marry Her Father's   Former Driver

హైదరాబాద్:ప్రేమించిన యువకుడితోనే తాను ఇక్కడే నివాసం ఉంటానని  సౌదీ యువతి తన తండ్రికి తేల్చి చెప్పేసింది. పోలీసుల సమక్షంలోనే తన అభిప్రాయాన్ని ఆమె నిర్మోహమాటంగా చెప్పేసింది. 
కామారెడ్డికి చెందిన అజీబుద్దీన్ అనే యువకుడు ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్ళాడు. అక్కడ ఇబ్రహీం ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేశాడు.  అయితే ఈ సమయంలోనే అజీబుద్దీన్ తో ఇబ్రహీం కూతురు ప్రేమలో పడింది. అయితే ఈ విషయం ఇంట్లో వారికి  తెలియదు.


ఆ యువతే ధైర్యంగా తనను పెళ్ళి చేసుకోవాలని అజీబుద్దీన్  ను కోరింది. కానీ, ఆయన భయపడ్డాడు. ఆ యువతే ఆ యువకుడికి ధైర్యం చెప్పింది. స్వగ్రామానికి వెళ్ళిపోవాని ఆమె సూచించింది. ఆ తర్వాత తాను వస్తానని ఆమె చెప్పింది. 
ఈ ఏడాది జనవరి మాసంలో అజీబుద్దీన్ కామారెడ్డికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత కూడ ఆమె అతడితో ఫోన్‌లో టచ్ లో ఉంది. ఈ ఏడాది మే చివర్లో ఆమె ఇండియాకు వచ్చింది. తన స్నేహితులను కలిసి వస్తానని చెప్పి ఆమె నేపాల్ మీదుగా ఇండియాకు చేరుకొంది. ఢిల్లీకి చేరుకోని అజీబుద్దీన్ కు సమాచారాన్ని ఇచ్చింది. ఢిల్లీ నుండి నేరుగా ఆమెను కామారెడ్డికి తీసుకొచ్చాడు. 

గ్రామ పెద్దల సహాయంతో  వీరద్దరూ వివాహం చేసుకొన్నారు.  ఈ విషయాన్ని ఆ యువతి ఫోన్ ద్వారా తన తండ్రికి చెప్పింది. అయితే ఈ విషయం తెలుసుకొన్న ఆ యువతి తండ్రి హైద్రాబాద్ చేరుకొని అజీబుద్దీన్ పై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు తండ్రి ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో ఆ యువతిని విచారించారు.అయితే తన ఇష్టపూర్వకంగానే అజీబుద్దీన్ ను వివాహం చేసుకొన్నట్టుగా ఆ యువతి పోలీసుల విచారణలో వెల్లడించింది.  తాను ప్రేమించి వ్యక్తి పేద వాడైనా సరే పెళ్ళి అయ్యాక ఆయనే నా భర్త  అంటూ పోలీసుల సమక్షంలో ఆ యువతి తన  తండ్రికి  తెగేసి చెప్పేసింది. 


జాగ్రత్తలు తీసుకొన్న యువతి

తన తండ్రి వ్యాపారవేత్త. సౌదీలో పలుకుబడి ఉంది. సౌదీలో అజీబుద్దీన్ ను వివాహం చేసుకోలేమని ఆమె భావించింది. దీంతో అతడిని ఇండియాకు పంపించి ఆ తర్వాత నేరుగా ఇండియాకు వచ్చి అతడిని వివాహం చేసుకొంది. ఇండియాకు వచ్చిన యువతి తాను  అజీబుద్దీన్ నువివాహం చేసుకొంటున్న విషయాన్ని తండ్రికి చెప్పింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే  ఆ యువతి తండ్రి సౌదీ మంత్రికి చెప్పారు.ఈ సమాచారం ఆధారంగా సౌదీ రాయబార కార్యాలయం అధికారులు ఈ  యువతి సమాచారాన్ని సేకరించారు. కామారెడ్డిలో యువతి ఉన్నట్టుగా గుర్తించి సౌదీ మంత్రికి సమాచారాన్ని అందించారు. తాను తన ప్రియుడితోనే ఉంటానని ఆ యువతి స్పష్టం చేసింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios