కోటీ 80 లక్షల పరిహారం చెల్లించడంతో కోర్టు అతడికి క్షమాభిక్ష ప్రసాదించింది. అతడి మరణశిక్ష రద్ద చేయడంతో పాటు జైలు జీవితం నుంచి కూడా విముక్తి కల్పించింది.

అగ్రరాజ్యం అమెరికాలో జాతి విద్వేశ దాడులతో మన వాళ్ల ప్రాణాలు తీస్తున్న వేళ ఓ అరబ్ షేక్ చూపిన ఔదార్యం సౌదీలో తెలగువాడి ప్రాణాలను కాపాడింది.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ధెగం గ్రామానికి చెందిన లింబాద్రి అనే వ్యక్తి 1995 లో బతుకు దెరువు కోసం సౌదీ వెళ్ళాడు.

అక్కడ ఓ అరబ్ షేక్ వద్ద పనిచేసేవాడు. 2007లో జరిగిన ఘర్షణలో లింబాద్రి చేతిలో సౌదీకి చెందిన వృద్ధుడు చనిపోయాడు. దీంతో కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. దాదాపు 10 ఏళ్లు సౌదీ జైళ్లోనే మగ్గుతున్న లింబాద్రిని ఓ షేక్ కరుణించాడు.

కోటీ 80 లక్షల పరిహారం చెల్లించడంతో కోర్టు అతడికి క్షమాభిక్ష ప్రసాదించింది. అతడి మరణశిక్ష రద్ద చేయడంతో పాటు జైలు జీవితం నుంచి కూడా విముక్తి కల్పించింది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వ కూడా చొరవ తీసుకోవడంతో లింబాద్రి మళ్లీ భారత్ రావడానికి అనుమతి లభించింది. సౌదీ నుంచి నిన్ననే అతడు హైదరాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతని కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.