హైదరాబాద్: తెలంగాణలో కరోనా  రోజురోజుకు విశ్వరూపం దాలుస్తోంది. కేవలం శనివారం ఒక్కరోజే  546 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ఇంత భారీగా పాజిటివ్ కేసులు బయటపడటం ఇదే మొదటిసారి.

శనివారం తెలంగాణ వ్యాప్తంగా 3,188 మంది అనుమానితులను పరీక్షించగా 546మందికి పాజిటివ్ గా, 2.642మందికి నెగెటివ్ గా తేలింది. ఇవాళ 154 మంది ఈ వైరస్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కరోనా కారణంగా ఇవాళ ఐదుగురు మృతిచెందారు. 

read more   తెలంగాణలో కరోనా వ్యాప్తి: ఇద్దరు ఐపిఎస్ అధికారులకు పాజిటివ్

ఇవాళ బైటపడ్డ పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్(458), రంగారెడ్డి(50) జిల్లాల నుండే వున్నాయి. మిగతా జిల్లాల్లో చూసుకుంటే మేడ్చల్ 6, మహబూబ్ నగర్ 3, వరంగల్(అర్బన్) 1, వరంగల్(రూరల్) 2, జనగామ 10, ఖమ్మం 2, కరీంనగర్ 13, ఆదిలాబాద్ 1 కేసు నమోదయ్యాయి. 

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53, 757 మందికి పరీక్షలు నిర్వహించగా 46,685 మందికి నెగెటివ్ గా 7,072మందికి పాజిటివ్ గా తేలింది. ఇందులో 3,363 యాక్టివ్ కేసులు వుండగా 3,506 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.